బాబు పరామర్శ, రాజధానిపై జైట్లీ ఆరా (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం గురించి జైట్లీ వాకబు చేశారు. విజయవాడ పరిసరాల్లో రాజధానిని నిర్మించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరారు.

రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఏమేరకు రాయితీలు ఇస్తుందో స్పష్టత రావాల్సి ఉంటుందని బాబు పేర్కొనగా... జైట్లీ సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన అన్ని అనుమతులూ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకున్న చంద్రబాబు ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవడంపై సమీక్ష నిర్వహించారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు వెలుపల ఉన్న ఆస్తులను ఉమ్మడి గవర్నర్‌ విభజించాల్సి ఉంటుంది కాబట్టి.. తొలుత ఇరు రాష్ట్రాలరెసిడెంట్‌ కమిషనర్లు చర్చించుకుని, గవర్నర్‌తో భేటీ అవ్వాలని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ సతీశ్‌ చంద్రకు చంద్రబాబు సూచించారు.

రాష్ట్ర విభజన చట్టం మేరకు ఏపీ భవన్‌ను 58:42 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవటంపై అధికారులతో చర్చలు జరిపారు. గవర్నర్‌ ఆమోదం తర్వాత కొత్త భవన్‌ను నిర్మించుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఆ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన జాతీయ భవనాల నిర్మాణ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ)కి అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనంతరం గెయిల్‌ ఇండియా చైర్మన్‌ త్రిపాఠి చంద్రబాబును కలిసేందుకు ఏపీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటు, ఇంటింటికీ పైప్‌లైన్ల ద్వారా వంటగ్యాస్‌ సరఫరా, ఇటీవల గ్యాస్‌ లీకై ప్రమాదానికి గురైన నగరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు స్నేహితులను కలిసేందుకు వెళ్లారు.

 బాబు - జైట్లీ

బాబు - జైట్లీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన్ను పరామర్శించారు.

బాబు - జైట్లీ

బాబు - జైట్లీ

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం గురించి జైట్లీ వాకబు చేశారు. విజయవాడ పరిసరాల్లో రాజధానిని నిర్మించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరారు.

 బాబు - జైట్లీ

బాబు - జైట్లీ

రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఏమేరకు రాయితీలు ఇస్తుందో స్పష్టత రావాల్సి ఉంటుందని బాబు పేర్కొనగా... జైట్లీ సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన అన్ని అనుమతులూ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం గురించి జైట్లీ వాకబు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+