టిక్కెట్ చేజారి కన్నీరు, బాబుకు హెచ్చరిక (పిక్చర్స్)

హైదరాబాద్: పార్టీలలో సీట్ల చిచ్చు రగిలింది. అన్ని పార్టీలలోను అసమ్మతి సెగ రేగింది. సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు అధినాయకత్వాలపై మండిపడుతున్నారు. రాజీనామాలు, ఆత్మహత్యలు, కార్యాలయాల విధ్వంసాలు, ఫర్నీచర్ విరగ్గొట్టడాలు, నిరసనలు, ధర్నాలు చేశారు.. చేస్తున్నారు.

తెలంగాణలో నామినేషన్లకు చివరి రోజు బుధవారం కావడంతో అన్ని పార్టీలు జాబితాలను వరుసగా పూర్తి చేస్తున్నాయి. అవకాశం కోసం చివరిదాగా ఎదురు చూసిన ఆశావహులు తమ పేరు జాబితాలో లేకపోయేసరికి పార్టీని ఎండగడుతున్నారు. వేరే పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

అన్ని పార్టీల్లో పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు నివాసం వద్ద మూడు రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం టిక్కెట్ దీపక్ రెడ్డికి ఇవ్వాలని కాల్వ శ్రీనివాసులుకు ఇస్తే ఓడిస్తామని చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేస్తూ కార్యకర్తలు హెచ్చరించారు. పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ రాజుకుంది.

నిరసనలు

నిరసనలు

టిడిపిలో టికెట్ల లొల్లి మరింత ముదిరింది. పార్టీ అధినేత చంద్రబాబు నివా సం నిరసనలకు వేదికవుతోంది. మల్కాజిగిరి పార్లమెంటు టికెట్ పార్టీ నేత రేవంత్ రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు బాబు నివాసం వద్ద నిరసన చేపట్టారు.

 నిరసనలు

నిరసనలు

రేవంత్ మిత్రమండలి పేరుతో సుమారు వంద మంది కార్యకర్తలు పెద్దపెద్ద పార్టీ జెండాలు పట్టుకొని రేవంత్‌కు మల్కాజిగిరి సీటు ఇవ్వాలని నినాదాలు చేశారు.

నిరసనలు

నిరసనలు

అదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మల్లారెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. వాస్తవానికి మంగళవారం రేవంత్ నామినేషన్ వేస్తారంటూ ప్రచారం జరిగినా ఆయన ఆ ఆలోచనను విరమించారు.

నిరసనలు

నిరసనలు

రేవంత్ తరపున ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎంపి సిఎం రమేశ్ రంగ ప్రవేశం చేసి చంద్రబాబుతో మాట్లాడారు. మల్లారెడ్డిని, రేవంత్‌ను కూడా పిలిపించి మాట్లాడారు.

నిరసనలు

నిరసనలు

రేవంత్‌ను చేవెళ్ల ఎంపి సీటుకు వెళ్లాలని కోరగా ఆయన నిరాకరించి మల్లారెడ్డినే అక్కడకు పంపి తనకు మల్కాజిగిరి సీటే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా మల్లారెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసనలు

నిరసనలు

బిజెపికి ఇచ్చిన సీట్లపై చంద్రబాబు నివాసం వద్ద ఆ పార్టీ నేతల నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు వచ్చి ఆ సీటును బిజెపికి ఇవ్వొద్దని,అక్కడ టిడిపి నేత గండ్ర సత్యనారాయణరావుకు టికెట్ ఇవ్వాలని ధర్నా చేశారు.

 నిరసనలు

నిరసనలు

ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చి గండ్రను చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి మాట్లాడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బిజెపికి వెళ్లడంతో ఆశాభంగానికి గురైన పార్టీ ప్రధాన కార్యదర్శి బోండా ఉమా మహేశ్వర రావును చంద్రబాబు మంగళవారం ఉదయం ఇక్కడకు పిలిపించి మాట్లాడారు.

నిరసనలు

నిరసనలు

ఆ సీటును బిజెపి నుంచి తీసుకోవడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని, ఏదైనా కారణం వల్ల వీలు కాకపోతే తాను తీసుకొనే నిర్ణయానికి సహకరించాలని ఆయ న బోండాను కోరారు.

 నిరసనలు

నిరసనలు

మలక్‌పేట,అంబర్‌పేట సీట్లు బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ అక్కడి కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి వచ్చి ధర్నా చే శారు. మలక్‌పేట సీటును టిడిపి తీసుకొని ముజాఫర్అలీఖాన్‌కు కేటాయించాలని కోరుతూ అక్కడి నుంచి వచ్చిన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నినాదాల సమయంలో మలక్‌పేట వాసి ఖాజా(చోటా లీడర్) గుండెపోటు వచ్చి కిందపడిపోయారు.

నిరసనలు

నిరసనలు

అంబర్‌పేట నుంచి వచ్చిన మైనారిటీ యువకులు ఒక దశలో చంద్రబాబు నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

 నిరసనలు

నిరసనలు

నాంపల్లి నియోజకవర్గం నుంచి కొత్తగా టిడిపిలో చేరిన మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్‌కు మద్దతుగా పెద్ద సంఖ్యలో మైనారిటీ యువకులు చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. ఫిరోజ్‌కు నాంపల్లి సీటు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

నిరసనలు

నిరసనలు

నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఋషిపాక యాదగిరికి కేటాయించాలని అక్కడ నుంచి వచ్చిన కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ కోసం త్యాగాలు చేయాలని చంద్రబాబు కోరుతున్నారని, త్యాగాలుకాదు ప్రాణ త్యాగానికై నా సిద్ధమేనని వారు ఆవేశంగా వ్యాఖ్యానించారు.

నిరసనలు

నిరసనలు

సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బద్రీనాథ్ యాదవ్‌కే కేటాయించాలని కోరుతూ కార్యకర్తలు, మహిళలు చంద్రబాబు నివాసం వద్ద నినాదాలు చేశారు.

నిరసనలు

నిరసనలు

వరంగల్ జిల్లా భూపాలపల్లిని బిజెపికి ఇవ్వవద్దంటూ నలుగురు కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కారు. టిడిపికి కంచుకోటగా ఉన్న నెల్లూరు రూరల్ స్థానాన్ని ఏ మాత్రం పట్టులేని బిజెపికి కేటాయించొద్దంటూ పార్టీ నేతలకు విజ్ఞప్తి చే శాయి.

 నిరసనలు

నిరసనలు

రాజమండ్రి అర్బన్ సీటును సీనియర్ నేత గోరం ట్ల బుచ్చయ్య చౌదరికే కేటాయించాలంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి.

 నిరసనలు

నిరసనలు

అవసరమైతే రాజమండ్రి రూరల్ సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే రెండు స్థానాలనూ గెలిపించుకుంటామని చంద్రబాబుకు వారు తెలిపారు.

ధర్నా

ధర్నా

ఆశించిన స్థానం దక్కలేదని కొందరు, అసలు సీటే దక్కలేదని మరికొందరు, పొత్తుల్లో సీటు గల్లంతు కావడంతో ఇంకొందరు, చేతిదాకా వచ్చిన టికెట్ అంతలోనే చేజారిపోవడంతో కన్నీరు మున్నీరై మరికొందరు... కాం గ్రెస్‌లో నిరసన జ్వాలలు మిన్నంటాయి.

ధర్నా

ధర్నా

టికెట్లురాని అసంతృప్తులు పార్టీ పెద్దలపై విరుచుకుపడ్డారు. కొందరు నేతలు మెరుపు వేగంతో పార్టీ కండువాలు మార్చేశారు. స్థానికులకు కాకుండా టికెట్లు ఎవరెవరికో ఇస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

ధర్నా

ధర్నా

తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా పినపాకను సీపీఐకి కేటాయించి, తనకు మొండి చేయి చూపడంపై సిటింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర మనో వేదనను వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేశారు.

ధర్నా

ధర్నా

మంగళవారం గాంధీ భవన్, మంత్రుల క్వార్టర్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటి వద్ద నిరసనకారులు చెలరేగిపోయారు. నినాదాలతో హోరెత్తించారు.

ధర్నా

ధర్నా

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సీటు మల్లు రవికి ఇవ్వడంపై రమేశ్ అనుచరులు గాంధీభవన్, పొన్నాల ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. మల్లు రవి గో బ్యాక్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

ధర్నా

ధర్నా

స్థానికుడైన రమేశ్‌కు జడ్చర్లను కేటాయించాలని పట్టుబట్టారు. ఇదే జిల్లా కొల్లాపూర్ టికెట్‌ను హర్షవర్ధన్‌రెడ్డికి కేటాయించడంపై విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.

ధర్నా

ధర్నా

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు గాంధీ భవన్‌కు వచ్చారు.

ధర్నా

ధర్నా

33 శాతం టికెట్లు కాదు గదా... కనీసం 10 శాతం కూడా మహిళలకు టికెట్లు ఇవ్వలేదని వారు నిరసించారు. మొదటి జాబితాలో తనకు నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించారని, తుది జాబితాలో అది గల్లంతైందని, డిగ్గీకి ఫోన్ చేస్తే బాన్సువాడ తీసుకోమంటున్నారని, తాను అర్బన్ నుండే పోటీ చేస్తానని చెప్పానని ఆకుల లలిత చెప్పారు.

ధర్నా

ధర్నా

కంటోన్మెంట్ సీటు వచ్చినట్లే వచ్చి... చేజారడంతో ఓయూ ఐకాస నేత క్రిషాంక్ కన్నీరు పెట్టుకున్నారు. తనకు ప్రకటించిన సీటును జెఎసి నేత గజ్జెల కాంతంకు కేటాయించినట్లు తెలియగానే క్రిషాంక్ ఆవేదనకు గురయ్యారు.

ధర్నా

ధర్నా

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నామని, తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వాపసు తీసుకన్నారని, తనకంటే సీనియర్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పొన్నాల ఇంటి నుంచి క్రిషాంక్ ఏడుస్తూ వెళ్లిపోయారు. ఎంపీ సీటు కోరితే అసెంబ్లీ ఇచ్చా

ధర్నా

ధర్నా

కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర రావు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గుడి కట్టించినా సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానం దక్కలేదు. అధిష్ఠానానికి ఎంతో విధేయుడిగా ఉన్నా శంకర్‌రావుకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ నేతలు ఆయనపై సానుభూతి చూపిస్తున్నారు.

ధర్నా

ధర్నా

33 శాతం టికెట్లు కాదు గదా... కనీసం 10 శాతం కూడా మహిళలకు టికెట్లు ఇవ్వలేదని వారు నిరసించారు. మొదటి జాబితాలో తనకు నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించారని, తుది జాబితాలో అది గల్లంతైందని, డిగ్గీకి ఫోన్ చేస్తే బాన్సువాడ తీసుకోమంటున్నారని, తాను అర్బన్ నుండే పోటీ చేస్తానని చెప్పానని ఆకుల లలిత చెప్పారు.

ధర్నా

ధర్నా

కంటోన్మెంట్ సీటు వచ్చినట్లే వచ్చి... చేజారడంతో ఓయూ ఐకాస నేత క్రిషాంక్ కన్నీరు పెట్టుకున్నారు. తనకు ప్రకటించిన సీటును జెఎసి నేత గజ్జెల కాంతంకు కేటాయించినట్లు తెలియగానే క్రిషాంక్ ఆవేదనకు గురయ్యారు.

ధర్నా

ధర్నా

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నామని, తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వాపసు తీసుకన్నారని, తనకంటే సీనియర్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పొన్నాల ఇంటి నుంచి క్రిషాంక్ ఏడుస్తూ వెళ్లిపోయారు. ఎంపీ సీటు కోరితే అసెంబ్లీ ఇచ్చారని సికింద్రాబాద్ అభ్యర్థి జయసుధ చెప్పారు.

ధర్నా

ధర్నా

కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర రావు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గుడి కట్టించినా సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానం దక్కలేదు. అధిష్ఠానానికి ఎంతో విధేయుడిగా ఉన్నా శంకర్‌రావుకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ నేతలు ఆయనపై సానుభూతి చూపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+