ఆ నలుగురు!: పోటీ పడి విన్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయింది. వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. దీంతో రాజకీయ నాయకులు వరద బాధితులను పరామర్శించేందుకు పోటీ పడ్డారు. మూడు నాలుగు రోజులుగా నాయకులు బాధితులను పరామర్శించడంలో బిజీ అయ్యారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలు జిల్లాల్లో పర్యటించారు, పర్యటిస్తున్నారు. ఇతర కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు కూడా పర్యటించి బాధితులను పరామర్శిస్తున్నారు.
వరద ప్రాంతాలను పర్యటిస్తున్న నేతలకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. చిరంజీవి సోమవారం పడవ నుండి జారి నీటిలో పడ్డారు. చంద్రబాబు నాయుడు సేఫ్ బోట్‌తో వెళ్లి ముంపు గ్రామాల్లో పర్యటించారు. విజయమ్మ పొలాలు, గట్ల వెంబడి తిరిగి పరామర్శించారు.
వినుత్న నిరసనలు తెలియజేస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి పళ్లం రాజు పర్యటిస్తే నాలుగు రోజులు ఏం చేశారంటూ బాధితులు నిలదీశారు. 30 ఏళ్లుగా వరదలు వస్తుంటే నేతలు ఇలా వచ్చి పరామర్శించి వెళ్లడమే తప్ప చేసిందేమీ లేదని తూర్పు గోదావరి జిల్లాలో ఓ గ్రామంలో గ్రామస్థులు 30వ వరద వార్షికోత్సవం అంటూ నిరసన తెలిపారు. నేతలు ఎప్పుడు ఇలా వచ్చి వెళ్తారే తప్ప తమకు చేసేదేమీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం పశ్చిమ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

చిరంజీవి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోమవారం విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. అందర్నీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలోని యలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం పర్యటించి రైతులను పరామర్శించారు.

కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏరియల్ సర్వే చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటన సాగింది.












Click it and Unblock the Notifications