వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలుదువ్వి లంచ్‌కి కలిశారు: ఢిల్లీ హీట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వేడి కొనసాగుతోంది. ఎపి భవన్ బుధవారం కూడా ప్రత్యేక, సమైక్య నినాదాలతో దద్దరిల్లింది. తెలంగాణ, సమైక్యవాదులు ఎదురెదురుగా బైఠాయించి పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు.

సై అంటే సై అంటూ కాలు దుదీవ్వారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు రెండు వర్గాల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాసేపటికి అందరికీ కడుపులో ఎలుకలు తిరిగాయి.

కాసేపు సమైక్య, తెలంగాణ నినాదాలకు విరామమిచ్చి విడివిడిగా క్యాంటీన్ దారిపట్టినా, అక్కడ మాత్రం కలివిడిగా తిరుగుతూ భోజనాలు ముగించారు.

రాయపాటి

రాయపాటి

విభజన బిల్లు పార్లమెంట్‌కు చేరే సమయం సమీపిస్తున్న కొద్దీ ఏపీ భవన్ వేడెక్కుతోంది. నిరంతరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. బుధవారం ఉదయాన్నే అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించిన తెలంగాణ వాదులు పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ సందడి సృష్టించారు.

సీమాంధ్ర టిడిపి

సీమాంధ్ర టిడిపి

11 గంటల సమయంలో సమైక్యవాదులు మెడలో కండువాలతో ఎపి భవన్‌లో అడుగుపెట్టారు. ఇది గమనించిన తెలంగాణ వాదులు నినాదాల జోరు పెంచారు.

పొన్నం

పొన్నం

ప్రతిగా సమైక్యావాదులు 'సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, ఒకే భాష.. ఒకే రాష్ట్రం, సేవ్ ఆంధ్రప్రదేశ్, ఎవడబ్బ సొత్తురా-హైదరాబాద్ మనదిరా' అంటూ గళమెత్తారు.

సీమాంధ్ర టిడిపి

సీమాంధ్ర టిడిపి

ఎపి భవన్ మెట్లపై కూర్చోగా, పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతోపాటు రెండువర్గాల వారు ఘర్షణకు తలపడకుండా మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

సీమాంధ్ర

సీమాంధ్ర

ఇరు ప్రాంతాల ఉద్యమకారులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో రెండు గంటలపాటు ఏపీ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. కానీ, మధ్యాహ్న భోజన వేళకు తొలుత తెలంగాణ, తర్వాత సమైక్యవాదులు ఆందోళన విరమించారు.

తెలంగాణ

తెలంగాణ

న్యూఢిల్లీలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాజయ్య విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం. పక్కన అంజన్ కుమార్ తదితరులు.

ఎపి భవన్

ఎపి భవన్

ఎపి భవన్‌లో తెలంగాణ బోనాలు తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ మహిళలు తెలంగాణలో అత్యంత ప్రాశస్త్యం కలిగిన బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

ప్రకాశ్ జవదేకర్

ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్. సీమాంధ్ర సమస్యలు పరిష్కరించి తెలంగాణ ఇవ్వాలని ఆయన చెప్పారు.

హీట్

హీట్

ఎపి భవన్ వద్ద తెలంగాణవాదులు వేప మండలతో నృత్యాలు చేశారు. అప్పటికే మెట్లపై కూర్చున్న సమైక్యవాదులు వీరిని చూసి జై సమైక్యాంధ్ర అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

బోనాలు

బోనాలు

ఎపి భవన్‌లో తెలంగాణ బోనాలు తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ మహిళలు తెలంగాణలో అత్యంత ప్రాశస్త్యం కలిగిన బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

బోనాలు 2

బోనాలు 2

ఎపి భవన్‌లో తెలంగాణ బోనాలు తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ మహిళలు తెలంగాణలో అత్యంత ప్రాశస్త్యం కలిగిన బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

కోదండరామ్

కోదండరామ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమను మరో మార్గం చూసుకోమంటారా? అని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం ప్రశ్నించారు.

ఓయు

ఓయు

నిజాం ఆస్తి తెలంగాణ ప్రజల ఆస్తేనని, ఎపి భవన్ ముమ్మాటికి తెలంగాణ భవనేనని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళన దృశ్యం.

సిఎం రమేష్

సిఎం రమేష్

సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సుజనా చౌదరి తదితరులు విలేకరులతో మాట్లాడుతూ...

English summary

 Photos of telangana heat in New Delhi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X