వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చార్మీ హంగామా: సస్పెన్స్‌తో వెంకీ టీం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో తెలుగు వారియర్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ ట్వంటీ 20 మ్యాచులో తెలుగు వారియర్స్ రెండు వికెట్ల తేడాతో బోజ్‌పురి దబాంగ్స్ పైన గెలిచింది.

తొలుత బజ్‌పురి దబాంగ్ 19 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆదర్శ్ ఐదు, అఖిల్ మూడు వికెట్లు తీశారు. ఆ తర్వాత తెలుగు వారియర్స్ ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లకు 144 పరుగులు చేసింది. రఘు 51 పరుగులతో రాణించాడు.

చివరి మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి నందకిశోర్ తెలుగు వారియర్స్‌ను గెలిపించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. మూడు బంతుల్లో ఫోర్లు కొట్టడంతో వారియర్స్ విజయం ఖాయమైంది.

సిసిఎల్ 1

సిసిఎల్ 1

శనివారం తెలుగు వారియర్స్ జట్టు సారథి వెంకటేష్ టాస్ గెలిచారు. అతను తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నారు. స్కోరు బోర్డు రెండు దగ్గర ఉండగానే భోజ్‌పురి తొలి వికెట్ కోల్పోయింది.

సిసిఎల్ 2

సిసిఎల్ 2

బోజ్‌పురి దబాంగ్స్ సారథి మనోజ్ తివారి మ్యాచును సిక్సర్లతో నడిపించాడు. తెలుగు వారియర్స్ జట్టు బ్రాండ్ అంబాసిడర్ చార్మీ మైదానంలో సందడి చేసింది.

సిసిఎల్ 3

సిసిఎల్ 3

మైదానంలో చురుగ్గా కదిలే తెలుగు వారియర్స్ ఈసారి కొన్ని క్యాచ్‌లు జారవిడిచారు. సామ్రాట్ ఓ చక్కటి క్యాచును అందుకొని అలరించాడు.

సిసిఎల్ 4

సిసిఎల్ 4

దబాంగ్ ఆటగాళ్లలో తివారి, ఓజా నాలుగో వికెట్‌కు భారీ భాగస్వామ్యం అందించారు. వీరి దూకుడును ఆదర్శ్ విడదీశాడు. అతని బౌలింగులో ఓజా ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు.

సిసిఎల్ 5

సిసిఎల్ 5

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో తెలుగు వారియర్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ ట్వంటీ 20 మ్యాచులో తెలుగు వారియర్స్ రెండు వికెట్ల తేడాతో బోజ్‌పురి దబాంగ్స్ పైన గెలిచింది.

సిసిఎల్ 6

సిసిఎల్ 6

తొలుత బజ్‌పురి దబాంగ్ 19 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆదర్శ్ ఐదు, అఖిల్ మూడు వికెట్లు తీశారు. ఆ తర్వాత తెలుగు వారియర్స్ ఓవర్లన్నీ ఆడి ఎనిమిది వికెట్లకు 144 పరుగులు చేసింది. రఘు 51 పరుగులతో రాణించాడు.

సిసిఎల్ 7

సిసిఎల్ 7

చివరి మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి నందకిశోర్ తెలుగు వారియర్స్‌ను గెలిపించాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. మూడు బంతుల్లో ఫోర్లు కొట్టడంతో వారియర్స్ విజయం ఖాయమైంది.

సిసిఎల్ 8

సిసిఎల్ 8

పద్దెనిమిదో ఓవర్లో ఆదర్శన్ తన బౌలింగుతో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు. బోజ్‌పురి పద్నాలుగు పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోవడం విశేషం.

సిసిఎల్ 9

సిసిఎల్ 9

బోజ్‌పురి దబాంగ్స్ పందొమ్మిది ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు వారియర్స్ నుండి రఘు, ప్రిన్స్ మొదటి నుండి స్కోరు బోర్డును పరుగు పెట్టించారు.

సిసిఎల్ 10

సిసిఎల్ 10

ఒక దశలో తెలుగు వారియర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో ఆరు బంతుల్లో పది పరుగులు తీయాల్సిన తరుణంలో నందకిశోర్ చివరి మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు.

English summary
Telugu Warriors Vs Bhojpuri Dabanggs Match on Saturday Photos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X