వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేక్ గ్యాంగ్: స్వయంగా సిపి, గుర్రాలివే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాతబస్తీలోని స్నేక్ గ్యాంగ్‌పైనే చర్చ అంతా సాగుతోంది. స్నేక్ గ్యాంగ్ దిమ్మతిరిగే దారుణాలు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. పాతబస్తీలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా దాడుల్లో పాల్గొని స్నేక్ గ్యాంగ్ వ్యవహారాలను బయటకు తీశారు. పాములతో మహిళలను బెదిరించి అత్యచారాలకు పాల్పడే కిరాతక స్నేక్ గ్యాంగ్‌లోని మిగతా నిందితుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.

పాతబస్తీలో దాగిన ఈ విషనాగుల కోసం సైబరాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కోసం పాతబస్తీ ప్రాంతాలైన పహాడిషరిఫ్, షాహిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. తనిఖీలు పూర్తి అయిన అనంతరం పహాడిషరిఫ్ పిఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడారు.

స్నేక్ గ్యాంగ్ ఘటనలో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. స్నేక్‌గ్యాంగ్ ప్రధాన నిందితుడు ఫైసల్‌దాయనీ సోదరులు, అనుచరులుగా అనుమానం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని సిపి తెలిపారు. అదేవిధంగా తనిఖీల్లో 9మంది రౌడీషీటర్లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన వివరించారు.

పట్టుకున్న గుర్రాలు ఇవే

పట్టుకున్న గుర్రాలు ఇవే

హైదరాబాద్ పాతబస్తీలో దాడులు నిర్వహించి స్నేక్ గ్యాంగ్ వాడుతున్న గుర్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కార్డన్ సెర్చ్

కార్డన్ సెర్చ్

గత నెలలో పెళ్లి కాబోయే కొత్త జంటలోని యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈనేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించింది.

రాత్రంతా సోదాలు

రాత్రంతా సోదాలు

సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదాచేశారు. సుమారు 400 మంది పోలీసులు 40 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 800 ఇళ్లను సోదాచేశారు.

స్నేక్ గ్యాంగ్‌కు చెక్

స్నేక్ గ్యాంగ్‌కు చెక్

పోలీసుల సోదాలో అనూహ్యంగా స్నేక్ గ్యాంగ్ అనుచరులు, సోదరులతో పాటు పేరుమోసిన 9మంది రౌడీషీటర్లు, ఎటువంటి ఆధారాలు లేని 30 వాహనాలు, గుర్రాలు, కార్లు కూడా పోలీసులకు లభించాయి. తనిఖీలతో స్నేక్‌గ్యాంగ్‌తో పాటు రౌడీషీటర్లు, ఇతర పాత నేరస్తుల గుండెల్లో కూడా సైబరాబాద్ పోలీసులు రైళ్లు పరుగెత్తించారు.

అప్రకటిత కర్ఫ్యూ మాదిరిగా..

అప్రకటిత కర్ఫ్యూ మాదిరిగా..

పాతబస్తీలో సైబరాబాద్ పోలీసులు చేపట్టిన తనిఖీలు అప్రకటిత కర్ఫ్యూని తలపించింది. మంగళవారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో చేపట్టిన తనిఖీలు బుధవారం ఉదయం ఏడుగంటల వరకు కొనసాగాయి.

తనిఖీలు ఇలా...

తనిఖీలు ఇలా...

బాలాపూర్ పాత గ్రామం పరిధిలోని షాహిన్‌నగర్, ఎర్రకుంట, పహాడిషరిఫ్ ప్రాంతాల్లోని ఒక్క ఇల్లు కూడా వదిలి పెట్టకుండా భారీ బందోబస్తు మధ్యన సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేశారు.

వాహనాల స్వాధీనం

వాహనాల స్వాధీనం

తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లేని 30 వాహనాలు, ప్రధాన నిందితుడికి చెందిన రెండు గుర్రాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు.

ఏకకాలంలో తనిఖీలు..

ఏకకాలంలో తనిఖీలు..

పాతబస్తీలో నేరాల అదుపునకు, నేరగాళ్ల అదుపునకు మంగళవారం అర్థరాత్రి నుండి బుధవారం ఉదయం ఏడుగంటల వరకు సుమారు 400 మంది పోలీసులు, 800 ఇళ్లలో ఏకకాలంలో జల్లెడ పట్టామని సివి ఆనంద్ చెప్పారు.

English summary
The Cyberabad police conducted a massive cordon and search operation at Pahadi shareef early on Wednesday targeting the snake gang’s associates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X