మోడీపై రాహుల్ సంచలన ఆరోపణలు: సుప్రీం గతంలో కొట్టేసినవే!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డారు, ముడుపులు తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ చెప్పారు. అయితే, అవన్నీ పనికిమాలిన ఆరోపణలని, జీరో అని, మాయ అని సుప్రీంకోర్టు ఇప్పటికే వాటిని కొట్టివేయడం గమనార్హం.

ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న సమయంలో ఆయనతోపాటు పలువురు రాజకీయ నాయకులకు కార్పొరేట్ పెద్దలు ముడుపులు చెల్లించారని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ గతంలోనే పిల్ దాఖలు చేశారు.

ఆదిత్య బిర్లా, సహారా గ్రూపులు కొన్నేళ్ల పాటు రాజకీయ నాయకులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చాయనడానికి ఈ పత్రాలు ఆధారమని ప్రశాంత భూషణ్ తన పిల్‌లో ఆరోపించారు. 2013 అక్టోబర్, నవంబర్ నెలల్లో గుజరాత్ సీఎంకు భారీ మొత్తం ఇచ్చినట్లు సహారా పత్రాల్లో ఉందన్నారు. అప్పట్లో ప్రశాంత్ భూషణ్ బయటపెట్టిన పత్రాలనే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చూపించడం గమనార్హం.

కాగా, విచారణకు ఆదేశించడానికి ఈ పత్రాలు విశ్వనీయమైనవి కావని సుప్రీం అప్పట్లో కొట్టేసింది. జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ అరుమ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. నవంబర్ 25న ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రిపై ఆరోపణలను నిరూపించాలంటూ మరింత విశ్వసనీయమైన సాక్ష్యాలు తీసుకురావాలని కోర్టు ప్రశాంత్ భూషణ్‌కు తెలిపింది.

 Rahul’s corruption charges against Modi fall flat; documents declared ‘zero’ by SC

'మీరు సహారా పత్రాల మీద ఆధారపడుతున్నారా? వాళ్లెప్పుడూ అసలైన పత్రాలు ఇవ్వరు' అని జస్టిస్ ఖేహర్ చెప్పారు. తాము ఈ పత్రాలతో ఏమాత్రం సంతృప్తి చెందలేదని, అవినీతిపరుడైన ఏ వ్యక్తి అయినా ప్రధానమంత్రి పేరుతో ఒక ఎంట్రీ వేయొచ్చు గానీ, దాన్ని విశ్వసనీయమైన సాక్ష్యంగా పరిగణించలేమని ఆయన అన్నారు.

ఈ కేసు విచారించడానికి తాము భయపడటం లేదని, కానీ కేవలం బిర్లా, సహారా గ్రూపుల నుంచి తెచ్చిన పత్రాలు ఏమాత్రం పనికిరానివని కోర్టు చెప్పింది. ఇవి సున్నా అని, మరింత విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు తేవాలని సూచించింది. కానీ, సరిగ్గా ఇలా సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆధారాలనే తీసుకొచ్చి రాహుల్ గాంధీ గుజరాత్‌లోని మెహసానాలో అవే ఆరోపణలు చేశారు.

ఇప్పటికే రాహుల్ సృష్టిస్తానన్న 'భూకంపం' గురించి సోషల్ మీడియాలో జోకులు పేలుతుండగా, ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆధారాలు తీసుకొచ్చి ఆరోపణలు చేయడంతో అవి కూడా తేలిపోవడం కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశ కలిగించే అంశంగా మారింది. ఇది ఇలా ఉంటే, సుప్రీంకోర్టు.. మోడీపై వచ్చిన ఆరోపణల్లో మరిన్ని పత్రాలు పరిశీలించాల్సి ఉందని ప్రశాంత్ భూషణ్ బుధవారం గమనార్హం. అవి కూడా పరిశీలించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+