గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారిని చంపిన ఎలుకలు ఇవే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఇటీవల ఎలుకలు ప్రజలను భయపెట్టాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చిన్నారిని కొరికిన చంపిన ఎలుకలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. ఎలుకలు కొరకడం వల్ల చిన్నారి మరణించడంతో అధికారులు యుద్ధప్రాతిపదికను ఎలుకలను పట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం వందలాది ఎలుకలు వేటగాళ్లకు చిక్కాయి.

కేవలం రెండు గంటల్లోనే వంద ఎలుకలు ఎరలకు చిక్కాయి. జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, ఎంపీ గల్లా జయదేవ్‌ ఆదేశాల మేరకు ఆస్పత్రిలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలతోపాటు ఎలుకల పట్టివేత ప్రారంభించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎలుకల వేటగాడైన వట్టిచెరుకూరు మండలవాసి హనుమంతరావు నాయకత్వంలో ఓ బృందం రంగంలో దిగింది.

ఆ బృందం సభ్యులు గురు, శుక్రవారాల్లో ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో ఉల్లిపాయలు, రొయ్యపొట్టు తదితరాలతో ఎరలు పెట్టారు. వీటికోసం వచ్చే ఎలుకలు సులువుగా ఉచ్చులో చిక్కుకుని మరణిస్తున్నాయి. ఇలా రెండు గంటల వ్యవధిలోనే వారు వంద ఎలుకలను మట్టుబెట్టారు.

మొత్తం పది మందితో..

మొత్తం పది మందితో..

తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పది మందితో కూడిన ఓ బృందం ఆస్పత్రికి చేరుకుని బోనులు, ఎరలు ఏర్పాటు చేసి ఎలుకలను పట్టేసింది.

మెరుగైన పరిస్థితి

మెరుగైన పరిస్థితి

గుంటూరు నగర పాలక సంస్థ నుంచి వందమంది పారిశుద్ధ్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై జీజీహెచ్‌కి పంపి శుభ్రం చేయించడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది.

ఆస్పత్రిని పరిశీలించిన డైరెక్టర్

ఆస్పత్రిని పరిశీలించిన డైరెక్టర్

కలెక్టర్‌, ఎంపీ, వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ శాంతారావు తదితరులు ఆస్పత్రి మొత్తం పరిశీలించారు. కాగా, జీజీహెచ్‌లో శిశువు మృతికి కారకులపై చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు.

బదిలీ వేటు

బదిలీ వేటు

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.వేణుగోపాలరావుతోపాటు పీడియాట్రిక్‌ సర్జరీ విభాగాధిపతి (ఇన్‌చార్జి) డాక్టర్‌ భాస్కరరావును బదిలీ చేసింది.

మంత్రి ప్రకటన

మంత్రి ప్రకటన

పసికందు తల్లి చావలి లక్ష్మితో అమానుషంగా ప్రవర్తించిన హెడ్‌ నర్సు విజయలక్ష్మి, స్టాఫ్‌ నర్సు విజయనిర్మలను సస్పెండ్‌ చే శారు. ఈ మేరకు మంత్రి కామినేని శ్రీనివాస్‌ శుక్రవారం రాజమండ్రిలో ప్రకటించారు. కాగా, పీడియాట్రిక్‌ సర్జన్‌ను బదిలీ చేయడాన్ని ప్రభుత్వ వైద్యుల సంఘం గుంటూరు శాఖ నిరసించింది.

English summary
Rats were caught in Guntur governement hospital in which a baby died due to biting of rats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X