టి: జగన్, తెరాసలదే హవా, బాబుకు మూడో స్థానం
2014 ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగనుందట. మన రాష్ట్రం విషయానికి వస్తే సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిల హవా కొనసాగనుందట. 2014లో మూడోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెసుకు ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదని ఇండియా టివి - టైమ్స్ నౌ సీ ఓటరు సర్వేలో తేలింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం అనుకూలించదని తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెసు పార్టీ ఎపిలో బాగా దెబ్బతింటుందని సర్వేలో తేలింది. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు చెరో పదమూడు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఇక కాంగ్రెస్‌కు రాష్ట్రంలో కేవలం 7 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారుతాయని తేలింది. అది కూడా ప్రస్తుతం యూపిఏ, ఎన్డియేకూటములతో సంబంధం లేని పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని వెల్లడైంది. నెల రోజులుగా దేశవ్యాప్తంగా జరిపిన ఈ సర్వేలో యూపిఏ కన్నా ఎన్డీయేనే ముందంజలో ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో బిజెపి బాగా పుంజుకుంటుందని సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది.
త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఛత్తీస్‌గఢ్‌లోనే కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయట. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 186, యూపిఏకు 117 సీట్లు దక్కుతాయని, ఇందులో బిజెపి 162, కాంగ్రెస్‌కు 102 సీట్లు గెలుచుకుంటాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి.
బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న అన్నాడిఎంకె, ఎస్పీ, బిఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జెడి, బిజెడి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలతో పాటు వామపక్షాలకు మొత్తంగా 240 సీట్లు వస్తాయని, బిజెపి తర్వాత వామపక్షాలు, బిఎస్పీలే అధికంగా లాభపడతాయట. ఎన్డీయేలోని బిజెపి, శివసేన, అకాలీదళ్, ఆర్పీఐ, మేఘాలయ ఎన్సీపి, హర్యానా జనహిత కాంగ్రెసులు 186 సీట్లు గెలుచుకుంటాయి. 2009లో ఎన్డీయే 159 సీట్లు గెలుచుకుంది.












Click it and Unblock the Notifications