వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లైమాక్స్‌కు చేర్చిన చంద్రబాబు: రేవంత్ రెడ్డి చిచ్చు

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగిలింది. పైకి పొత్తుల విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే చిచ్చు రగిలినట్లు అనిపిస్తోంది. కానీ, లోన తెలంగాణలో టిడిపి అనుసరించబోయే వ్యూహానికి సంబంధించిన రాజకీయం ఉంది. ప

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్ ముందు ఆ రెండు? ఎన్టీఆర్ భవన్ లో నేడే తేలనుందా ? | Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగిలింది. పైకి పొత్తుల విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే చిచ్చు రగిలినట్లు అనిపిస్తోంది. కానీ, లోన తెలంగాణలో టిడిపి అనుసరించబోయే వ్యూహానికి సంబంధించిన రాజకీయం ఉంది. పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దంటూ టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరికతో విభేదాల కథ క్లైమాక్స్‌కు చేరింది.

తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై టిడిపి నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటానికి అడ్డుకట్ట వేయాలనే వ్యూహం చంద్రబాబు అనుసరించినట్లు భావించవచ్చు. దాంతో రేవంత్ రెడ్డి టిడిపిలో చిచ్చు పెట్టడానికి సిద్ధమయ్యారు.

కాంగ్రెసు పార్టీతో పొత్తు చర్చలు సాగిస్తున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం నాయకులు బయటకు వచ్చేందుకు సిద్దపడినట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులపై వారు విరుచుకుపడుతున్నారు. టిడిపి తెలంగాణ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి వైఖరిని తప్పు పడుతున్నారు.

రేవంత్ రెడ్డితో కాంగ్రెసు నేతలు ఇలా...

రేవంత్ రెడ్డితో కాంగ్రెసు నేతలు ఇలా...

గత ఐదారు నెలలుగా రేవంత్‌తో పాటు మరికొందరు కీలక నేతలతో కాంగ్రెసు ముఖ్య నేతలు టచ్‌లో ఉన్నారు. పొత్తు చర్చల్లో భాగంగా 30-35 స్థానాలను రేవంత్‌ ప్రతిపాదించగా, 20-25 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

చిచ్చుకు తెర తీసిన మోత్కుపల్లి....

చిచ్చుకు తెర తీసిన మోత్కుపల్లి....


రేవంత్ రెడ్డి వర్గం కాంగ్రెసుతో పొత్తు చర్చలు కొనసాగిస్తున్న తరుణంలో తెలంగాణ టీడిపి సీనియర్ నేత మోత్కుపల్లి చేసిన ప్రకటన పార్టీలో చిచ్చుకు కారణమైంది. కాంగ్రెసుతో అసలు పొత్తు ప్రసక్తే లేదని, అవసరమైతే టీఆర్‌ఎస్‌ లేదా బీజేపీతో కలిసి పోటీ చేస్తామంటూ ఆయన చెప్పారు. దీంతో కొద్దిరోజుల పాటు కాంగ్రెసుతో జరుపుతున్న చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.

ఆజ్యం పోసిన చంద్రబాబు...

ఆజ్యం పోసిన చంద్రబాబు...

పొత్తుపై టిడిపి తెలంగాణ నేతల్లో విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చిచ్చుకు ఆజ్యం పోశారు. ఎన్నికల వరకు ఎవరు కూడా పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు సూచించారు. పొత్తులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమంటూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన కూడా జారీ అయింది.

రేవంత్ రెడ్డికి జీర్ణం కాలేదు..

రేవంత్ రెడ్డికి జీర్ణం కాలేదు..

తెరాసతో పొత్తు పెట్టుకోవాలన్న కొంతమంది టిడిపి తెలంగాణ ముఖ్య నేతల వాదనకు పలువురు ఏపీ టీడీపీ సీనియర్లు మద్దతు పలికారు. దాన్ని రేవంత్‌ వర్గం జీర్ణించుకోలేక పోయింది. ఏపీ టీడీపీ నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం ఇక్కడ తమను బలిచేస్తున్నారని రేవంత్ రెడ్డి భావించారు. అందుకే ఆయన ఎపి టిడిపి నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.

ఏది మాట్లాడినా వ్యక్తిగతమే...

ఏది మాట్లాడినా వ్యక్తిగతమే...


ఎన్నికల పొత్తులపై ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా చేసేవారి ప్రకటనలకు పార్టీశ్రేణులు అయోమయానికి గురి కావద్దని సూచించింది. దాంతో కెసిఆర్‌కు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి కళ్లెం పడినట్లుగా భావించారు.

ఎన్నికల సమయంలోనే పొత్తులు: రమణ

ఎన్నికల సమయంలోనే పొత్తులు: రమణ

పార్టీకి సంబంధించిన అంశాలు పార్టీ వేదికల మీదనే చర్చించుకుందామని టిడిపి తెలంగాణ అధక్షుడు ఎల్ రమణ తేల్చి చెప్పారు. కార్యకర్తలు, అభిమానాలు ఎటువంటి అయోమయానికి లోనుకాకుండా పార్టీ పటిష్ఠత కోసం సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే పొత్తులని మహానాడులో తీర్మానించడంతో పాటు, హైదరాబాదులో పార్టీ జాతీయ అధ్యక్షులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో కూడా స్పష్టం చేశారని రమణ వివరించారు.

టీడీపీ వ్యక్తుల పార్టీ కాదు: అరవింద్‌

టీడీపీ వ్యక్తుల పార్టీ కాదు: అరవింద్‌


టీడీపీ వ్యక్తులపై నడిచే పార్టీ కాదని, బడుగు, బలహీనవర్గాల పార్టీ అని జాతీయ అధికార ప్రతినిధి అరవింద్‌గౌడ్‌ అన్నారు. రేవంత్‌ లాంటి వాళ్లు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. పార్టీతోనే రేవంత్‌కు గుర్తింపు వచ్చింది తప్ప, ఆయనతో పార్టీకి కాదని స్పష్టం చేశారు. అరవింద్ కుమార్ గౌడ్ ప్రకటనను బట్టి టిడిపి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని, రేవంత్ రెడ్డిని వదులుకోవడానికి కూడా సిద్ధమైందన అర్థం చేసుకోవచ్చు.

అనంతపురం సంఘటనలు....

అనంతపురం సంఘటనలు....

తెలంగాణ టిడిపిలో పొత్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కెసిఆర్ పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరు కావడం, అక్కడ టిడిపి, టిఆర్ఎస్‌కు మధ్య భవిష్యత్తులో ఉండబోయే సంబంధాలు బయటపడడం రేవంత్ రెడ్డికి మింగుడు పడలేదనే చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెసును దెబ్బ తీయడానికి, అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని దెబ్బ తీయడానికి ఎపి టిడిపి నేతలు కెసిఆర్‌తో చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. వెలమ, కమ్మ సామాజిక వర్గాలు ఒక్కటై తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే వ్యూహరచన జరిగిపోయిందని కూడా స్పష్టమైంది. దానికి వెల్‌కం వ్యూహమని కూడా పేరు పెట్టారు. ఇది రేవంత్ రెడ్డికి ఏ మాత్రం మింగుడు పడని వ్యూహం.

వ్యూహం తేలిపోయాక....

వ్యూహం తేలిపోయాక....


ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పినప్పటికీ, అధిష్టానం పేర ప్రకటన విడులైనప్పటికీ వ్యూహం మాత్రం ఖరారైందనే విషయం తేలిపోయింది. తెలుగుదేశం, తెరాస కలిసి వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయనేది కూడా స్పష్టమైంది. ఈ స్థితిలో చంద్రబాబు మాటలను నమ్మి పార్టీలో కొనసాగడం వృధా అనే అభిప్రాయానికి రేవంత్ రెడ్డి వచ్చినట్లు భావిస్తున్నారు.

English summary
As the events taking place in Telangana politics and the Telangana Telugu Desam party strategy cleared, Revanth Reddy was forced to take decission on his political future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X