బాబు, కెసిఆర్: 'వెల్-కం'దే అధికారమన్న రేవంత్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో వెల్-కం గ్రూపుకు లాభం చేకూరిందని చెప్పారు. వెల్-కం గ్రూపు అంటే తెలంగాణలో వెలమ, సీమాంధ్రలో కమ్మలకు అధికారం లభించిందని వ్యాఖ్యానించారు.
గురువారం అసెంబ్లీ అనంతరం ఆయన లాబీలో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఎపి విభజన ద్వారా.. వెల్-కం గ్రూపులోని వెలమలు తెలంగాణలో, కమ్మ గ్రూపువారు ఆంధ్రప్రదేశ్‌లో అధికారం లభించిందని, మరి తమకు (రెడ్డి) ఏదిని ప్రశ్నించారు. రెడ్డి సామాజిక వర్గం మొదటి నుండి పరిపాలనలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు.

తమ వర్గానికి చెందిన జానా రెడ్డి, జైపాల్ రెడ్డి.. వంటి నేతలను ఎంతకాలం ఖాళీగా ఉండమంటారని వ్యాఖ్యానించారు. తన లక్ష్యమైతే 2019లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే అన్నారు. మిగతా పదవుల్లో ఎవరున్నా సరే.. తనకు మాత్రం సిఎం కుర్చీ చాలునని చెప్పారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశల్లేవని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని ఓ హోదాగా భావిస్తే తప్పని చెప్పారు. ప్రజల బాగోగులు చూసేందుకు బాధ్యతతో మెలగాలని, లేదంటే చరిత్ర వారిని విస్మరించదన్నారు.












Click it and Unblock the Notifications