నో అంటూ వెళ్లారు: నిరాశపర్చిన సచిన్, తెలుగులో..

నెల్లూరు: రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పీఆర్‌ కండ్రిగ పర్యటన కొంత నిరాశ పరచింది. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం సచిన్‌ వచ్చారు. అనుకున్న విధంగా కార్యక్రమాలు సాగకపోవడం, గ్రామస్థులతో ముఖాముఖి రద్దు కావడంతో కొందరు కొంత అసంతృప్తికి గురయ్యారు. మొదటి నుంచి పోలీసులు గట్టిగానే బందోబస్తు నిర్వహించినా, చివరకు అభిమానుల ప్రవేశంతో గందరగోళం నెలకొంది.

ప్రజల్లో చైతన్య తెచ్చేలా సచిన్‌ ప్రసంగాలు కొనసాగాయి. 4 గంటల పాటు కార్యక్రమాలు కొనసాగే లా షెడ్యూల్‌ రూపొందించినా రెండు గంటలతోనే సరిపెట్టారు. కలెక్టర్‌ ఎన్ .శ్రీకాంత్‌ సంధానకర్తగా వ్యవహరించి సచిన్‌ ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. రెండురోజులుగా జిల్లా అధికారులంతా పుట్టంరాజు కండ్రిగలోనే మకాం వేశారు.

పీఆర్‌ కండ్రిగను సచిన్‌ దత్తత తీసుకొని రెండున్నర కోట్లకు పైగా రూపాయల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం ఉదయం 9.10గంటలకు గ్రామానికి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి నారాయణ, లెక్టర్‌ శ్రీకాంత్‌, జేసీ రేఖారాణి తదితరులు ఉన్నారు. మొదట గోపూజతో కార్యక్రమాలు ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాల పైలాన్‌ను సచిన్‌ ఆవిష్కరించారు. ఇక అక్కడి నుంచి ఉరుకులు, పరుగులతో కార్యక్రమాలను నిర్వహించారు.

 సచిన్

సచిన్

సచిన్‌ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఎంతో సంతోషమని నేరుగా చూసిమాట్లాడుతామని వచ్చామని చివరకు నిరాశే మిగిలిందని కొందరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి అభిమానులు తరలిరావడమే ఇందుకు కారణమే అంటున్నారు. సచిన్‌ రాకముందు సచిన్‌ ఆంగ్ల ప్రసంగాన్నితెలుగులోకి అనువదించమే కాక మహిళా సంఘాలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమాలకు సంధాన కర్తగా కలెక్టర్‌ వ్యవహరించారు. నాలుగుగంటలు జరగాల్సిన సచిన్‌ పర్యటన రెండు గంటలకే పరిమితమైంది.

సచిన్

సచిన్

రెండు చోట్ల జరిగిన సచిన్‌ ప్రసంగాల్లో ప్రజలను చైతన్యవంతం చేసేలా సాగింది. స్వచ్ఛభారత్‌ ఉద్దేశంతోపాటు ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయాలని అభిలషించారు. అలాగే తన ప్రసంగాలలో వెల్లడించిన అంశాలను పాటిస్తే మళ్లీ ఇదే గ్రామానికివస్తానంటూ హామీ ఇచ్చారు. రెండు కుటుంబాలను పరిశీలించిన సచిన్‌ వారి కుటుంబ నేపథ్యం, జీవన విధానం, ఇంట్లో వసతులు అడిగి తెలుసుకున్నారు.

సచిన్

సచిన్

పీఆర్‌ కండ్రిగ గ్రామస్థులమైన మేము.. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంసద్ ఆదర్శ కార్యక్రమాల్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ మధ్యం, ధూమపానం, జూదం వంటి దురాలవాట్లకు బానిసలు కాకుండా వయోజన విద్యలోభాగస్వాములై సహజ వనరులను కులమతాలకు అతీంగా వినియోగించుకొని గాంధీ తెచ్చిన స్వరాజ్యం వంద శాతం విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.. అంటూ అధికారులు మాటలకు గ్రామస్థులతోపాటు సచిన్‌ పలికారు.

సచిన్

సచిన్

పోలీసుల వలయంలో ఉన్న గ్రామస్థులను కూడా గుర్తింపు కార్డులు ఉంటేనే ప్రవేశానికి అనుమతించారు. మొదట అభివృద్ధి కార్యక్రమాల పైలాన్‌ ఆవిష్కరించే కార్యక్రమానికి సచిన్‌ విచ్చేస్తున్న సందర్భంలో జేసీ రేఖారాణి మంత్రి గన్‌మెన్‌లను, అనుచరులపై మండిపడ్డారు. మంత్రి ఒక్కరే ఉంటారని, ఎవరూ అవసరం లేదని జేసీ అన్న మాటలతో మంత్రి ఆమెపై ఆగ్రహంవ్యక్తం చేశారు.

పలు కార్యక్రమాల్లో సచిన్‌ ఉత్సాహంగా పాల్గొన్నారు. 11 గంటలకు డ్వాక్రా సంఘాలతో ముఖాముఖిలో పాల్గొనే వరకు అనుకున్న విధంగా కార్యక్రమాలన్నీ సాఫీగా సాగుతూవచ్చాయి. కొందరు అభిమానులు సచిన్‌ భయ్యా.. అంటూ నినాదాలు చేస్తుండగా, వారి వైపు తిరిగి చేతులూపుతూ సచిన్‌ కనిపించారు. గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమానికి గ్రామస్థులను ఉదయం 8 గంటలకే కూర్చోబెట్టారు.

ఈ సభా వేదికకు సచిన్ రావడంతోనే యువకులు పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. మైక్ అందుకున్న సచిన్‌ ప్రశాంతంగా ఉంటేనే మాట్లాడుతానంటూ పదేపదే చెబుతూ వచ్చారు. నమస్కారం... అంటూ తెలుగు తనకు తెలియదంటూ ఆంగ్లంలో మాట్లాడారు. విధులకు వచ్చేసిన పోలీసులు కూడా సచిన్‌ను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు పోటీపడ్డారు. ఓ సమయంలో తోపులాట జరగడంతో సభ గందరగోళంగా మారింది. మైకులు కూడా పనిచేయక మొరాయించాయి.

ముందు వరుసలో కుర్చీల్లో కూర్చున్న వారిపై అభిమానులు దూసుకురావడంతో రోప్‌పార్టీ పోలీసులు వారిని నెట్టేయడంతో మరింత గందరగోళం నెలకొంది. సచిన్‌కు వలయంగా ఏర్పడడం తప్పితే అభిమానులను నియంత్రించడంలో పోలీసులు చేతులెత్తేశారు. అక్కడ జరిగే హడావిడీ చూసిన సచిన్‌ 5 నిమిషాల్లో ప్రసంగం ముగించారు. మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం ఉంటుందని ప్రకటించినా నో అంటూ సచిన్‌ వెళ్లిపోయారు. దీంతో గ్రామస్థులు నిరాశ పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+