వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోయిన్‌పై లైంగిక దాడి: కుట్ర, హీరోతో వైరమే కారణమా..

ఓ హీరోతో వైరమే మలయాళీ నటిపై లైంగిక దాడికి దారి తీసినట్లు బిజెపి నేత ఒకరు ఆరోపించారు. సినీ పరిశ్రమ యావత్తు మాఫియా గుప్పిట్లో ఉందని కూడా ఆయన అన్నారు

By Pratap
|
Google Oneindia TeluguNews

కొచ్చి: ప్రముఖ హీరోయిన్‌పై లైంగిక దాడి కేసులో ఓ హీరో హస్తం ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై లైంగిక దాడి వెనక సినీ ప్రముఖుల కుట్ర ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రౌడీ షీటర్ సునీల్ కుమార్‌తో కుమ్మక్కయి వారు ఆ పని చేయించారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

వృత్తిపరమైన వైరం కారణంగా హీరోయిన్‌పై లైంగిక దాడి చేయించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నామని కేరళ క్రైంబ్రాంచ్‌ ఐజీ దినేంద్ర కశ్యప్‌ తెలిపారు. హీరోయిన్‌పై దాడి చేసిన తర్వాత సునీల్‌ కుమార్‌ సినీ పరిశ్రమలోని కొంతమందితో ఫోన్లో మాట్లాడినట్లు తేలింది.

ఈ మేరకు పోలీసులకు ఆధారాలు లభించాయి. దాంతో, సినీ పరిశ్రమలోని కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని ఐజీ తెలిపారు. అయితే, ఈ ఘటన వెనక కుట్ర ఉందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి.

నేరపూరిత కుట్ర ఉందా..

నేరపూరిత కుట్ర ఉందా..

హీరోయిన్‌పై లైంగిక దాడి వెనక నేరపూరిత కుట్ర ఉందని సినీ నటి మంజు వారియర్‌ ఆరోపించారు. నటిపై దాడి ఘటనకు వ్యతిరేకం గా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ విమర్శలు చేశారు. హీరోయిన్‌పై లైంగిక దాడి ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆమె ఆ ఆరోపణ చేశారు.

హీరోతో వైరమే కారణమా...

హీరోతో వైరమే కారణమా...

కేరళ సినీ పరిశ్రమ మాఫియా గుప్పిట్లో ఉందని, లైంగికదాడికి గురై న హీరోయిన్‌కు ఓ హీరోతో వైరం ఉందని, దాంతో ఆమె పరిశ్రమలో వివక్షకు గురవుతోందని, ఆ హీరోతో శత్రుత్వానికి, దాడికి ఏమైనా సంబంధం ఉందేమో విచారించాలని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు వి.మురళీధరన్‌ అన్నారు.

నిందితులు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు...

నిందితులు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు...

నటిపై దాడి కేసులో పరారీలో ఉన్న సునీల్‌ కుమార్‌ను పట్టుకునేందుకు లుకవుట్‌ నోటీసు జారీచేశారు. కాగా, ప్రధాన నిందితుడు సునీల్‌ సహా మొత్తం ముగ్గురు తమకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
హీరోయిన్‌ డ్రైవర్‌ వాంగ్మూలం ఆధారంగా తమను ఈ కేసులో ఇరికిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది.

దాడిపై సినీ పరిశ్రమ డిమాండ్...

దాడిపై సినీ పరిశ్రమ డిమాండ్...

సాధ్యమైనంత త్వరగా దోషులను శిక్షించాలని దక్షిణ భారత ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(ఎస్‌ఐఏఏ) డిమాండ్‌ చేసింది. దేశంలో మహిళలు ఎవరికీ భద్రతలేదని ఈ ఘటన తో స్పష్టమైందని సీఎంకు రాసిన లేఖలో అభిప్రాయపడింది. సీఎం పినరయి విజయన్‌కూడా ఈ ఘటనను ఖండించారు. బాధిత హీరోయిన్‌తో మాట్లాడారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ ఆమెతో ఫోనులో మాట్లాడారు.

English summary
BJP leader Muralidharan accused that the enimity with hero lead to the sexual attack on Malayali heroine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X