జగన్‌కు ఎస్పీవై ట్విస్ట్: కిరణ్ రెడ్డికి సమైక్య కితాబు
హైదరాబాద్: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగుతానని చెబుతూనే పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ట్విస్ట్ ఇచ్చారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుసుకోవడంతో జగన్ పార్టీ నుంచి బయటకు వస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, తాను వైయస్సార్ కాగ్రెసు పార్టీలో కొనసాగుతానని చెబుతూనే ఆయన సమైక్యాంధ్ర కోసం కిరణ్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. అది కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి పక్కనే ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యాలయంలో ఆ పనిచేశారు.
ఈ మీడియా సమావేశంలో తొలుత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. తనవల్లే రాష్ట్ర విభజన తీర్మానాన్ని వెనక్కి పంపడం సాధ్యమైందని గొప్పలు చెప్పుకొంటున్నాడని విమర్శించారు. "అసలు నువ్వు మొగాడివేనా!? నీకు దమ్ముందా? సీడబ్ల్యూసీ తీర్మానంనాడే ఎందుకు రాజీనామా చేయలేదు?'' అంటూ ధ్వజమెత్తారు.

ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తిన తర్వాత ఎస్పీవై రెడ్డి మైకు అందుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్య సింహంగా కితాబు ఇచ్చారు. రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి పంపడంలో చక్కగా పని చేశారంటూ కొనియాడారు. కిరణ్ సమైక్యవాది అని అంగీకరిస్తానని తేల్చి చెప్పారు. సమైక్యవాది ముసుగులో మీ పార్టీ వాళ్లే కిరణ్ విభజనకు సహకరిస్తున్నాడని విమర్శిస్తున్నారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే "మంచి పని ఎవరు చేసినా, అంగీకరించాల్సిందే. ఎందుకు ఒప్పుకోకూడదు?'' అని ఎదురు ప్రశ్నించారు.
వైఎస్ తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనపై అభిమానంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరానని చెప్పారు. అంతకుమించి మరేమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించారు. మీడియాలో వార్తలు వచ్చాయి కనక వివరణ ఇచ్చేందుకే మాట్లాడుతున్నానన్నారు.












Click it and Unblock the Notifications