అలా అన్లేదు, పోలీస్‌లే: సునంద కేసులో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతిలో మరో కొత్తకోణం! మంగళవారం నాడు ఢిల్లీ పోలీసులు సునంద కేసును హత్య కేసుగా నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, పోలీసులు హత్య కేసుగా నమోదు చేసిన మరుసటి రోజే ఈ రోజు (బుధవారం) ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్త మరో ట్విస్ట్ ఇచ్చారు.
ఆయన బుధవారం మాట్లాడుతూ.. రిపోర్టులో ఎక్కడ కూడా తాము హత్యకోణాన్ని పేర్కొనలేదని చెప్పారు. కేవలం విషం వల్ల మృతి చెందిందని మాత్రమే తాము తెలిపామన్నారు. నివేదికలో హత్యకోణాన్ని పేర్కొన్నారా అని పదే పదే అడగటంతో.. అది తాము ఎలా చెప్పగలమని, దానిని పోలీసులు తేల్చుతారని చెప్పారు. కాగా, గత ఏడాది చివరి నెలలో ఢిల్లీ పోలీసులు కేరళ వైద్యులను సునంద పుష్కర్ కేసు విషయమై కలిశారు.

కాగా, గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని లీలా ప్యాలస్ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుడిచేతి మణికట్టుపైన గాట్లు, శరీరం నీలంరంగులోకి మారడం పలు అనుమానాలు రేకెత్తించింది. ఆ గదిలో ఒత్తిడి తట్టుకునేందుకు వాడే ఆల్ర్పాక్స్ మాత్రల షీట్లు లభించాయి.
తన భర్తకు పాకిస్థాన్ మహిళా జర్నలిస్టుతో వివాహేతర సంబంధం ఉందంటూ సునంద ఆరోపించిన రెండు రోజులకే ఆమె మరణించడం చర్చనీయాంశమైంది. పోస్ట్‌మార్టమ్ నివేదికను మార్చాలని తనపై ఒత్తిడి పెరుగుతోందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోపించడం కూడా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications