వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మా సాయం, ఇబ్బంది నుంచి బయటపడ్డ బింద్రా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ వెంటనే జోక్యం చేసుకోవడంతో భారత స్టార్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా ఇబ్బంది నుంచి బయటపడ్డారు. మీ సహకారం వెంటనే అవసరమని బింద్రా ట్వీట్ చేయగా, సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు. దీంతో అతను పెద్ద ఇబ్బంది నుంచి బయటపడ్డారు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు కోచ్‌తో కలిసి అభినవ్ బింద్రా రియోడిజనీరో బయలుదేరాడు. జర్మనీలో కోచ్‌ పాస్‌పోర్ట్‌ దొంగిలించబడింది. అయితే, సుష్మా వేగంగా త్వరగా స్పందించడంతో బింద్రాతోపాటు అతడి కోచ్‌ కూడా రియోడిజనీరో వెళ్లారు.

Sushma Swaraj comes to Abhinav Bindra's rescue, asks for gift for country

సకాలంలో జోక్యం చేసుకుని తమ పని సాఫీగా సాగేందుకు సహకరించిన సుష్మా స్వరాజ్‌‌కు, రాయబారి గుర్జిత్ సింగ్‌కు బింద్రా కృతజ్ఞతలు కూడా తెలిపారు.

రియో పోటీలకు వెళ్తుంటే తన కోచ్‌ పాస్‌పోర్ట్‌ చోరీకి గురైందని, సుష్మాజీ.. టోర్నీలో పోటీ పడేందుకు వీలుగా కొత్త ప్రయాణ పత్రాలు, బ్రెజిల్‌ వీసా పొందాలంటే మీ సహకారం అవసరమని.. బింద్రా ట్వీట్‌ చేశాడు. వెంటనే సమస్యను పరిష్కరించాలని సుష్మా స్వరాజ్‌ భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు. దీంతో ఇబ్బంది తొలగిపోయింది.

English summary
Swift intervention by the Ministry of External Affairs saved the blushes for shooting ace Abhinav Bindra on Saturday, after the Olympian gold medallist's coach lost her passport while in Germany en route to Brazil, where he is attending the ISSF World Cup, a test event for the upcoming Olympics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X