టిపై కిరణ్ ప్లాన్ వర్కవుట్: ఆత్మరక్షణలో అధిష్టానం
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బౌన్సర్‌కు కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆత్మరక్షణలో పడిందా? అంటే అవుననే అంటున్నారు. కిరణ్ నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత మంత్రులు, శాసన సభ్యులు సభను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ దీనినే అస్త్రంగా చేసుకొని రాష్ట్రపతికి మరోసారి గడువు కోరుతూ లేఖ రాసే యోచనలో ఉన్నారు.
కిరణ్ నోటీసు బౌన్సర్‌తో అధిష్టానం ఆత్మరక్షణలో పడగా, తెలంగాణ నేతలు అడ్డుకుంటుండటంతో 'వారే అడ్డుకుంటున్నారు' కాబట్టి అదనపు సమయం ఇవ్వాల్సిందేనని కిరణ్ లేఖ రాయనున్నారు. తద్వారా తన వద్ద ఆఖరి బంతి ఉందన్న కిరణ్ అస్త్రం ఇప్పుడు బాగా పని చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్ర నేతలు చర్చను అడ్డుకున్నప్పుడు గడువు పెంపు కోరితే.. మీరే అడ్డుకొని మీరే ఎలా గడువు కోరుతారని తెలంగాణ నేతలు ప్రశ్నించారని, ఇప్పుడు వారే అడ్డుకున్నారు కాబట్టి గడువు పెంపు కోరేందుకు అవకాశం ఉంటుందని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పలువురు చెబుతున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పర్యవసానంగా రాష్ట్రపతి విధించిన గడువు ముగిసిన తర్వాత ఏర్పడే ప్రతిష్ఠంభనను ఎలా అధిగమించాలి? అనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ అధినాయకత్వ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తూ కలవర పెడుతున్న కిరణ్ అనూహ్య రీతిలో ఏకంగా ఈ బిల్లునే వెనక్కి పంపాలని నిర్ణయించడం అధినాయకత్వానికి మింగుడు పడటం లేదనే చెప్పవచ్చు.
పరిస్థితి చేజారిపోతోందని తెలిసినప్పటికీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులను మందలించి గతంలో మాదిరిగా దారిలోకి తెచ్చుకునే స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం లేకపోవడంతో జనవరి 30 తర్వాత జరిగే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అధిష్టానంపై కిరణ్ తిరుగుబావుటా ఎగురవేసినప్పటికీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధిష్టానం ఇష్ట పడటం లేదు. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అధిష్టానం ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. నకిలీ నోట్లున్నట్లు నకిలీ బిల్లులు ఉండవని, కిరణ్‌కున్నంత రాజ్యాంగ నైపుణ్యం తనకు లేదని, ఏడాదిలో అంతా పునర్విభజనపై నిపుణులు అయిపోయారని అసహనం వ్యక్తం చేశారు. కిరణ్ పైన ఎలాంటి క్రమశిక్షన చర్యలుండవని ముకుల్ వాస్నిక్ చెప్పారు.
తెలంగాణ బిల్లుపై జరుగుతున్న చర్చలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయటం శుభపరిణామమని, ఈ విషయంలో తాము ఎటువంటి విప్ జారీ చేయలేదని వాస్నిక్ అన్నారు. కిరణ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నకు జవాబు చెప్పటానికి మరికొందరు నాయకులు జంకుతున్నారు.












Click it and Unblock the Notifications