ఆంధ్రా సిబ్బందికి తెలంగాణ సత్కారం, ప్రశంసలు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశుధ్య సిబ్బందికి తెలంగాణ సర్కార్ సముచిత సత్కారం చేసింది. గోదావరి మహాపుష్కరాల్లో పారిశుధ్య సేవలందించేందుకు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి 450 మంది పారిశుధ్య సిబ్బంది భద్రాచలం వచ్చి.. విశిష్ట సేవలందించారు.
సేవలకు గుర్తింపుగా వీరికి చీరలు, పంచెలు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాచలంలో పారిశుధ్య సిబ్బందికి ఖమ్మం కలెక్టర్ కె ఇలంబరిది దుస్తుల పంపిణీ నిర్వహించారు.

పుష్కరాల్లో పారిశుధ్య కార్మికులు పోషించిన పాత్ర అభినందనీయమని కలెక్టర్ కె ఇలంబరిది పేర్కొన్నారు. ఎటువంటి విమర్శలు రాకుండా పుష్కరాల సందర్భంలో పారిశుధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారన్నారు.
రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ పారిశుధ్యం పట్ల చూపిన శ్రద్ధ అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రతీ కార్మికుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీ షాన్వాజ్‌ఖాసీం, జాయింట్ కలెక్టర్ దివ్య, సబ్‌కలెక్టర్ కాళీచరణ్, ఏఎస్‌పీ భాస్కరన్, ఆర్డీవో ఆర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications