ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్డినెన్స్: సీతారాములు అక్కడ, ఆస్తులు ఇక్కడ

By Pratap
|
Google Oneindia TeluguNews

Temple will be in Seemadhra, properties in Telangana
ఖమ్మం: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను సీమాంధ్రులో కలుపుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడంతో మన్యం ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. ఆర్డినెన్స్ కారణంగా భద్రాద్రి రాముడు ఒక్కడే తెలంగాణలో ఉంటుండగా, ఆయన పరివారం మొత్తం సీమాంధ్రకు వెళ్లిపోతుంది. ఆయన ఆస్తులన్నీ ఆంధ్రాలో కలిసిపోతున్నాయి. శ్రీరామ దివ్యక్షేత్రానికి కేవలం 3కి.మీల దూరంలో ఉన్న వెయ్యి ఎకరాల పురుషోత్తపట్నం భూములు మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందుతాయి.

కాపుగొంపల్లితో పాటు పలు గ్రామాల్లోని సీతారాముడి భూములు కూడా ఆంధ్రాలో కలవనున్నాయి. తాజా సమాచారం ప్రకారం కూనవరం, విఆర్‌పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పూర్తిగా సీమాంధ్రలో కలుపుతుండగా బూర్గంపాడు మండలంలోని సారపాక నుంచి లక్ష్మీపురం, మోరంపల్లి బంజర, పినపాక పట్టీనగర్ వరకు ఆరు రెవెన్యూ గ్రామాలు తెలంగాణలో, మిగిలిన ప్రాంతమంతా ఆంధ్రాలో విలీనం కానున్నాయి.

భద్రాచలం పట్టణానికి తూర్పునున్న క్రాంతి ఐటిఐ, ఉత్తరానున్న ఎటపాక, కూనవరం రోడ్డులోని పురుషోత్తపట్నం వరకు మాత్రమే తెలంగాణలో విలీనమై మిగతా ప్రాంతమంతా ఆంధ్రాకు చెందనుంది.
ఆర్డినెన్స్‌తో ఆయా పనుల కోసం సమీప భద్రాచలం పట్టణంలో ఉంటూ స్థిరనివాసం ఏర్పర్చుకున్నవారు తెలంగాణలో ఉంటుండగా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు స్వగ్రామాల్లో ఉంటున్నారు. ఇప్పుడు వీరంతా ఆంధ్రా పరిధిలోకి వెళ్లిపోయారు.

తెలంగాణలోని 119వ ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న భద్రాచలం రాష్ట్ర విభజన కారణంగా ముక్కలు చెక్కలైంది. భద్రాచలం పట్టణం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు మాత్రమే ప్రస్తుతం ఈ నియోజకవర్గం పరిధిలో మిగిలాయి.

English summary
Due to ordinance issued merging 7 mandals of Khammam district in seemandhra (Andhra Pradesh) Bhadradri Ramudu will be in Telangana and properties will go to Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X