తెరాసలో పోటీ: చిరు నేతపై కెసిఆర్‌కు మజ్లిస్ షాక్

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలలో పోటీ విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి మలి జాబితా లెక్క కుదరడం లేదట! ఇంకా 46 స్థానాలపై వెలువడాల్సిన జాబితాలో ఇరవై చోట్లకు పైగా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టిక్కెట్లు ఆశిస్తున్న వారు హైదరాబాదులోనే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెరాస ఇప్పటి వరకు 73 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 46 స్థానాల్లో పది స్థానాలు హైదరాబాదులో మజ్లిస్ ప్రాబల్యం ఉన్నవే.

మిగిలిన 36 చోట్ల ఇరవై స్థానాల్లో టిక్కెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. నల్గొండ జిల్లా భువనగరిరి నుండి వ్యాపారి శేఖర్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ ఆశిస్తున్నారు. హైదరాబాదులోని ముషీరాబాద్ స్థానం కోసం నాయిని నర్సింహా రెడ్డి ఉన్నారు. అయితే, భువనగిరి ఇవ్వకుంటే ముషీరాబాద్ ఇవ్వాలని శ్రవణ్ కోరుతున్నారు. ఎల్పీ నగర్, ముషీరాబాద్, భువనగిరి, ఇబ్రహీంపట్నం, చొప్పదండి, సనత్ నగర్, సిర్ఫూర్ కాగజ్ నగర్ తదితర స్థానాల పైన పోటా పోటీ నెలకొంది.

TRS dilemma on it's third list

మరోవైపు, తెరాసకు మజ్లిస్ పార్టీ షాకిచ్చిందట. ప్రజారాజ్యం పార్టీ గ్రేటర్ అధ్యక్షుడిగా పని చేసిన ఫిరోజ్ ఖాన్‌ను తెరాసలోకి తీసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మజ్లిస్ పార్టీ కన్నెర్ర చేస్తోందట. ఫిరోజ్‌ను చేర్చుకుంటే తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరిస్తోందట. దీంతో తెరాస తగ్గిందంటున్నారు. నాంపల్లి అసెంబ్లీ స్థానంలో ఫిరోజ్‌ఖాన్‌కు అనుకూలంగా సర్వేలు ఉండటంతో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించారట.

aaa

అయితే, అనూహ్యంగా మజ్లిస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. మజ్లిస్ నేతల ఆగ్రహానికి కారణం లేకపోలేదు. 2009లో పిఆర్పీ తరఫున నాంపల్లి నుంచి ఫిరోజ్ పోటీ చేశారు. మజ్లిస్ అభ్యర్థిని చివరిదాకా బలంగా ఎదుర్కొన్నారు.

ccc

ఒకదశలో ఫిరోజ్ ఖాన్ గెలిచినట్టు భావించారు కూడా. ఈ నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్‌పై సహజంగానే మజ్లిస్ గుర్రుమంటున్నది. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్‌కు ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకొని సిటింగ్‌ను సైతం మజ్లిస్ పక్కన పెట్టిందంటున్నారు.

bbb
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+