వెనక్కి తగ్గని వెంకయ్య: ఇప్పటికీ ఆయనే పెద్ద దిక్కు

Posted By:
Subscribe to Oneindia Telugu
  వెనక్కి తగ్గని వెంకయ్య.. సమస్యలపై ప్రత్యేక దృష్టి !

  న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వెంకయ్య నాయుడు తన దృష్టిని తగ్గిస్తారనే ప్రచారం సాగింది. అయితే, ఆయన ఇప్పటికీ రాష్ట్ర సమస్యలపై ఎప్పటిప్పుడు స్పందిస్తూ వాటిని పరిష్కరించడానికి చర్లు తీసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఢిల్లీలో ఇప్పటికీ ఆయన పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతోందని అంటున్నారు.

   కేంద్ర మంత్రులతో విరివిగా పరిచయాలు..

  కేంద్ర మంత్రులతో విరివిగా పరిచయాలు..

  కేంద్ర మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించిన వెంకయ్య నాయుడికి కేంద్ర మంత్రులతో విరివిగా పరిచయాలు ఉన్నాయి. వారితో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. కేంద్ర మంత్రులను నేరుగా తన నివాసానికి పిలిపించుకుని లేదా ఫోన్‌లో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను ఆయన పరిష్కరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

   పోలవరంపై చంద్రబాబు ఇలా...

  పోలవరంపై చంద్రబాబు ఇలా...

  పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య తగాదాలు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంపై బిజెపి నేతలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ వారికి అందించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారికి సూచించారు.

   వెంకయ్య వద్దకు బిజెపి నేతలు.

  వెంకయ్య వద్దకు బిజెపి నేతలు.

  చంద్రబాబు ఇచ్చిన వివరాలతో బిజెపి నాయకులు కంభంపాటి హరిబాబు, గంగరాజు, విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, మాధవ్ తదితరులు ఢల్లీ వచ్చారు. వారు వెంకయ్య నాయుడిని కలిశారు. వెంటనే ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఫోన్ చేశారని సమాచారం. దాంతో అధికారులను వెంట పెట్టుకుని గడ్కరీ వెంకయ్య నాయుడికి నివాసానికి వచ్చారు.

   దాంతో గడ్కరీ ఇలా చెపారు.

  దాంతో గడ్కరీ ఇలా చెపారు.

  పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య రానివ్వబోమని నితిన్ గడ్కరీ ఆ సమయంలో చెప్పారు. పునరావాస ప్యాకేజీని కూడా కేంద్రమే చూసుకుంటుందని కూడా హామీ ఇచ్చారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెచ్చుకునే విధంగా అనుకున్న సమయానికే పోలవరాన్ని పూర్తి చేస్తామని ఆయన వెంకయ్యనాయుడికి, ఏపీ బీజేపీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారని తెలుస్తోంది.

  ఆ తర్వాత వారు ఇలా..

  ఆ తర్వాత వారు ఇలా..

  నితిన్ గడ్కరీతో సమావేశం ముగిసిన తర్వాత బిజెపి నాయకులు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని వారు కోరారు. వారు అక్కడికి వెళ్లే లోపే అరుణ్ జైట్లీకి వెంకయ్య నాయుడి నుంచి ఫోన్ వెళ్లినట్లు సమాచారం. ఆ విషయాన్ని అరుణ్ జైట్లీ స్వయంగా బిజెపి నేతలకు చెప్పారని తెలుస్తోంది.

  టిడిపి నేతలు సైతం...

  టిడిపి నేతలు సైతం...

  దుగరాజుపట్నం ఓడరేవు, కడప ఉక్కు ఫ్యాక్టరీలపై మాట్లాడేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నేతృత్వంలో తెలుగుదేశంపార్టీ ప్రతినిధి బృందం వెంకయ్య నాయుడిని కలిసింది. దాంతో ఆయన సంబంధిత మంత్రులను పిలిపించి మాట్లాడారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Vice president of India Venkaiah Naidu is still keen on Andhra Padesh issues.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి