కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించేనా?
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో సిరీస్ ఓటమి నేపథ్యంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ మూడో వన్డేకు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీ ఉద్దేశ్యం ఏదో కానీ, మూడో వన్డేకు ముందు మాత్రం తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. బంగ్లాదేశ్ మెరుగ్గా ఆడిందని, నిజాయతీగా చెప్పాలంటే సంశయాత్మక నిర్ణయాల వల్లే మేము దెబ్బతిన్నామన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్వేచ్ఛగా ఆడలేకపోయామని, దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నాడు.
తమ ఆట చూసిన ఎవరికైనా ఇది అర్థమవుతుందని చెప్పాడు. విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించలేదు. కానీ అయితే, ఆ వ్యాఖ్యలు ధోనీని ఉద్దేశించే అని ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది చర్చకు దారి తీసింది.

బంగ్లాదేశ్‌తో సిరీస్ ఓటమి అనంతరం కూడా మహేంద్ర సింగ్ ధోనీకి తోటి ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు. అశ్విన్, సురేష్ రైనాలు ధోనీకి కితాబిచ్చారు. మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సయ్యద్ కిర్మాణీ, గంగూలీలు కూడా మద్దతు పలికారు.
కోహ్లీ చెప్పిన విభేదాల పైన గంగూలీ కూడా పరోక్షంగా స్పందించాడు. అదంతా వట్టిదే అన్నాడు. ''భారత్ ఎప్పుడు ఓడినా ఇలాంటి కథనాలు వస్తుంటాయి. నాకు తెలిసి భారత డ్రెస్సింగ్‌రూమ్‌లో అంతా సవ్యంగానే ఉంది'' అని గంగూలీ చెప్పాడు.












Click it and Unblock the Notifications