సచిన్‌కు బౌలింగ్: భార్య అంజలి అన్నట్లే....
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ తొలి రోజు బుధవారం గమ్మత్తయిన సంఘటన చోటు చేసుకుంది. టీ విరామ సమయానికి కేవలం 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. వికెట్లు పడడం లేదు. మ్యాచ్ విసుగు తెప్పించే స్థితికి వచ్చింది. ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి ఓ కోరిక కోరిందట. టీ విరామానికి ముందు సచిన్‌కు ఒక ఓవరు బౌలింగ్ ఇస్తారా, అలా ఇస్తే ఎంతో బాగుంటుందని, ప్రేక్షకుల్లో మరోసారి ఉత్సాహం వస్తుందని అంజలి అన్నదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
కోల్‌కతాకు బయలుదేరే ముందు సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్‌కు బౌలింగ్ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగేది సచిన్ సిరీస్. నిజంగానే అనూహ్యంగా అంజలి కోరిక నెరవేరింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెండూల్కర్‌కు బంతిని ఇచ్చాడు. దాంతో అంజలి ఉద్వేగానికి గురైంది. థ్రిల్ ఫీలైంది కూడా. అదే సమయంలో ఈ భాగస్వామ్యాన్ని సచిన్ విడదీస్తే టెర్రిఫిక్‌గా ఉంటుందని ఆమె అన్నదట. ఆమె అనుకున్నట్లే ఆ ఓవరు నాలుగో బంతికి సచిన్ టెండూల్కర్ వికెట్ తీశాడు.

సచిన్ వికెట్ తీయడంతో అంజలి ఎగిరి గంతేసింది. ఈ రోజే సచిన్ బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నారా అని ప్రెసిడెంట్స్ బాక్స్‌లో కూర్చున్న అంజలిని జగ్‌మోహన్ దాల్మియా ఆడిగారు. లేదు, ఈ రోజు కోరుకోవడం లేదని ఆమె చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
సచిన్ బ్యాటింగ్‌కు విషయంలో అంజలి నర్వెస్ ఫీలవుతుండగా, కుమారుడు అర్జున్ మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. అర్జున్ మ్యాచ్ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికే ఎక్కువ ఆసక్తి ప్రదర్శించాడు. అంజలి మాత్రం తన కుమారుడు లంచ్ చేశాడా, లేదా అనే విషయాలు పట్టించుకోవడం గమనించినట్లు చెబుతున్నారు.
క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ముఖ్య అతిథిగా అంజలి క్యాబ్ క్లబ్ హౌస్ లోయర్ టైర్‌లో కూర్చుని మ్యాచును వీక్షించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా సచిన్‌కు టీ విరామానికి ముందు ఒక్క ఓవరు బౌలింగ్ ఇస్తే బాగుండునని అన్నదట. అదే జరిగింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications