నిరభ్యంతరంగా ఆ పని చేయండి: కేటీఆర్.., అంతా 'తొలిప్రేమ' ఎఫెక్ట్?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ల ప్రతీ కదలికను జనం నిశితంగా గమనిస్తూనే ఉంటారు. నాయకుల సరదాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కూడా వారు కొన్నిసార్లు కలగజేసుకోవచ్చు. ముఖ్యంగా.. సమస్యల గురించి పక్కనపెట్టి సరదాలకు పోతున్నారన్న విమర్శలూ ఎదురవ్వచ్చు. అయితే రాజకీయ జీవితంలో ఉన్నంత మాత్రానా.. వ్యక్తిగత జీవితం ఉండకూడదా? అనేది తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ లాంటి వారి వాదన..

  First Space Film of Tollywood?
  'తొలిప్రేమ'పై కేటీఆర్..:

  'తొలిప్రేమ'పై కేటీఆర్..:

  వరుణ్ తేజ్-రాశిఖన్నా జంటగా నటించిన 'తొలిప్రేమ' సినిమాను శనివారం రాత్రి మంత్రి కేటీఆర్ వీక్షించారు. అనంతరం సినిమా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి లవ్ స్టోరీ అని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లిరిక్స్ అన్నీ బాగున్నాయని ట్వీట్ చేశారు.

  'సినిమాలు చూస్తూ కూర్చుంటావా?':

  'సినిమాలు చూస్తూ కూర్చుంటావా?':

  తొలిప్రేమ సినిమాపై కేటీఆర్ చేసిన ట్వీట్ కొంతమంది తెలంగాణ నెటిజెన్స్ కు నచ్చలేదు. పైగా తన ట్విట్టర్ డీపీ మీద కూడా 'తొలిప్రేమ' అని రాసుకోవడం మరింత ఆగ్రహం తెప్పించింది.

  రాష్ట్రంలో అనేక సమస్యలు పెట్టుకుని సినిమాలు చూస్తూ కూర్చుంటావా? అన్న రీతిలో ఆయన్ను విమర్శించారు. ఈ విమర్శలకు కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు.

  నిరభ్యంతరంగా ఆ పని చేయండి..:

  'నా డీపీని మార్చుకోవడం.. నేనో సినిమాను చూడటం పెద్ద సమస్యగా భావిస్తున్నవాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నా.. నేను ప్రజా జీవితంలో ఉండవచ్చు. కానీ నాకూ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉంటాయి. అవి మీకు నచ్చకపోతే.. నిరభ్యంతరంగా నన్ను అన్ ఫాలో చేయవచ్చు..' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

  కేటీఆర్ తీరు నచ్చట్లేదట..:

  కేటీఆర్ తీరు నచ్చట్లేదట..:

  రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల విషయంలో, రైతుల ఆత్మహత్యల విషయంలో అంతగా స్పందించని కేటీఆర్.. ఇలా సినిమా వాళ్లను పదేపదే మోసేస్తుండటం నెటిజెన్స్‌కే కాదు, చాలామందికి నచ్చడం లేదు. ఆంధ్రా ప్రాంత నటీనటులతో ప్రత్యేక అనుబంధం కోసం కేటీఆర్ ఎందుకంతలా తాపత్రయపడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana IT minisiter KTR tweeted like this 'Get a life guys; while I may be in public life, I am also entitled to my likes & dislikes. If you don’t like it, feel free to unfollow me'

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి