వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిని నిలదీయట్లేదని బిజెపి పెద్దల అసహనం: బాబుతో తేల్చుకునే వారికే చీఫ్?

ఏపీ బీజేపీలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాఖలో త్వరలో మార్పులు, చేర్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ బీజేపీలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాఖలో త్వరలో మార్పులు, చేర్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

అలా వెళ్లాను అంతే: 'బాబు వద్దకు రాయబారం వెళ్లి చిక్కిన మంత్రి'పై తలసాని ఇలా..అలా వెళ్లాను అంతే: 'బాబు వద్దకు రాయబారం వెళ్లి చిక్కిన మంత్రి'పై తలసాని ఇలా..

 టిడిపి ఒత్తిడి.. మూడేళ్లుగా పదవిపై సందిగ్ధత

టిడిపి ఒత్తిడి.. మూడేళ్లుగా పదవిపై సందిగ్ధత

గత మూడేళ్లుగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపై సందిగ్ధత నెలకొంది. మిత్రపక్షమైన టీడీపీ ఒత్తిడి మేరకు ఇప్పటి వరకు ఎంపీ కంభంపాటి హరిబాబుని అధ్యక్షుడిగా కొనసాగించారని అంటారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

 కాపులకు.. అధ్యక్షుడి రేసులో వీరు

కాపులకు.. అధ్యక్షుడి రేసులో వీరు

కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే భవిష్యత్తులో ఒంటరి పోరాటానికి సిద్ధం కావచ్చనే భావనతో బిజెపి పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై తేల్చేసిన అనంతరం పార్టీలో కొంత స్తబ్ధత కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది.

చంద్రబాబును ప్రశ్నించకపోవడం ఏమిటి

చంద్రబాబును ప్రశ్నించకపోవడం ఏమిటి

కంభంపాటి పనితీరు పట్ల పార్టీ అగ్రనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు తమవిగా మలచుకునేందుకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న బిజెపి నేతలు ప్రశ్నించక పోవటంపై పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.

 సుజనా చౌదరీ వ్యాఖ్యలపై..

సుజనా చౌదరీ వ్యాఖ్యలపై..

ముద్ర రుణాలకు సంబంధించి ఇటీవల కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీలోకలకలం రేపుతున్నాయి. బ్యాంకర్లు రుణాలివ్వకపోతే ప్రజాప్రతినిధులను సంప్రదించాలని ఆయన లబ్ధిదారులకు సూచించటాన్ని బిజెపి నేతలు ఆక్షేపిస్తున్నారు. అంతకుముందు ఇదే విషయంలో అధిష్ఠానానికి సైతం ఎదురుతిరిగి టిడిపి నేతలను సోము వీర్రాజు ప్రశ్నించిన సంగతి విదితమే. దీంతో బిజెపి, టిడిపిల మధ్య అంతర్గతంగా స్పర్థలు రేగుతున్నాయి.

 టిడిపితో అమీతుమీ తేల్చుకునే వారికే పగ్గాలు

టిడిపితో అమీతుమీ తేల్చుకునే వారికే పగ్గాలు

ఈ పరిస్థితుల్లో టీడీపీతో అమీతుమీ తేల్చుకునే స్థాయి కలిగిన సమర్థులకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందులో గంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజుల్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టేనా?

పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టేనా?

కన్నాకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి మాణిక్యాలరావుకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ప్రతిపాదన ముందుకొచ్చినా ఆయన నిరాకరించారట. ఈ నేపథ్యంలో కన్నానే పీఠమెక్కించాలనే యోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు పేరు కూడా పరిశీలనలో ఉంది.

English summary
Former Minister Kanna Laxminarayana and MLC Somu Veerraju are in race of Andhra Pradesh Bharatiya Janata Party chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X