స్వచ్ఛ భారత్: చీపురు పట్టిన సచిన్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారత ప్రధాని మంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు భారత్ మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడు. ఆదివారం కొంత మంది యువకులతో కలిసి సచిన్ టెండూల్కర్ స్వయంగా చీపురు పట్టి ముంబైలోని ఓ విధిని ఊడ్చి శుభ్రం చేశాడు.
‘ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్‌లో నాయకత్వ బాధ్యతను నాకు అప్పగించారు. కాబట్టి మా జట్టుతో ఇక్కడికి వచ్చి.. పరిసరాలను శుభ్రం చేశాను'అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు. స్వచ్ఛ భారత్‌పై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు సచిన్‌తో సహా తొమ్మిది మంది ప్రముఖులను ఈ కార్యక్రమం అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్రమోడీ ఎంపిక చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏడాదికి వంద రోజులు పాల్గొనాలని ప్రజలకు మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు.
మోడీ ఆహ్వానించినవారిలో 9 మందిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.

స్వచ్ఛ భారత్‌లో చీపురు పట్టిన సచిన్
భారత ప్రధాని మంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు భారత్ మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడు.

స్వచ్ఛ భారత్‌లో చీపురు పట్టిన సచిన్
ఆదివారం కొంత మంది యువకులతో కలిసి సచిన్ టెండూల్కర్ స్వయంగా చీపురు పట్టి ముంబైలోని ఓ విధిని ఊడ్చి శుభ్రం చేశాడు.

స్వచ్ఛ భారత్‌లో చీపురు పట్టిన సచిన్
‘ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్‌లో నాయకత్వ బాధ్యతను నాకు అప్పగించారు. కాబట్టి మా జట్టుతో ఇక్కడికి వచ్చి.. పరిసరాలను శుభ్రం చేశాను'అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు.

స్వచ్ఛ భారత్‌లో చీపురు పట్టిన సచిన్
స్వచ్ఛ భారత్‌పై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు సచిన్‌తో సహా తొమ్మిది మంది ప్రముఖులను ఈ కార్యక్రమం అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్రమోడీ ఎంపిక చేశారు.

స్వచ్ఛ భారత్‌లో చీపురు పట్టిన సచిన్
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications