ఒంగోలు గిత్తా మజాకా..! 19 లక్షలు పలికిన గిత్త
గిత్తల్లో ఒంగోలు గిత్తలకు ఉన్న డిమాండే వేరు. ఎంత ధర పెట్టైనా సరే ఒంగోలు గిత్తలను సొంతం చేసుకోవడానికి వెనకాడరు రైతులు. తాజాగా ఓ ఒంగోలు గిత్త దిమ్మ తిరిగే రేటు పలికింది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లెకు చెందిన అంజిరెడ్డి అనే రైతు అరుదైన ఒంగోలు గిత్త కోసం రూ.19 లక్షల భారీ మొత్తం వెచ్చించి మరీ సొంతం చేసుకున్నాడు.

వైఎస్సార్ జిల్లా కొత్తపేటకు చెందిన రైతు గురుజాల రామకృష్ణారెడ్డి నుంచి ఈ గిత్తను కొనుగోలు చేశారు అంజిరెడ్డి. ఒంగోలు గిత్తలాంటి అరుదైన జాతిని అంతరించి పోకుండా చూడాలనేదే తన ఆశయం అని, అందుకే అంత ధర వెచ్చించి మరీ గిత్తను సొంతం చేసుకున్నానని తెలియజేశారు అంజిరెడ్ది.












Click it and Unblock the Notifications