వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరల్డ్ కప్ రికార్డులు: కెప్టెన్లు... ఎక్కువ మ్యాచ్‌లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మెల్ బోర్న్: ఫిబ్రవరి 14 నుంచి ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ మొదవనుంది. ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఎంతో మంది ఆటగాళ్లు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు.

11వ ఐసీసీ వరల్డ్ కప్ ఎడిషన్‌లో భాగంగా గతంలో నమోదైన రికార్డులను పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. వరల్డ్ కప్‌లో ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పది మంది జాబితాను అందిస్తున్నాం.

వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌ల కెప్టెన్లు:

* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) --- 29 మ్యాచ్‌లు (గెలిచినవి 26, ఓడినవి 2, ఫలితం తేలనవి 1)

* స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజీలాండ్) --- 27 మ్యాచ్‌లు ( గెలిచినవి 16 ఓడినవి 10, ఫలితం తేలనవి 1)

* మొహమ్మద్ అజారుద్దీన్ (భారతదేశం) --- మ్యాచ్‌లు 23 ( గెలిచినవి 10, ఓడినవి 12, ఫలితం తేలనవి 1)

* ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్) --- 22 మ్యాచ్‌లు (గెలిచినవి 14, ఓడినవి 8)

* క్లైవ్ లాయిడ్ (వెస్ట్ ఇండీస్) --- 17 మ్యాచ్‌లు (గెలిచినవి 15, ఓడినవి 2)

* గ్రేమ్ స్మిత్ (సౌత్ ఆఫ్రికా) --- 17 మ్యాచ్‌లు (గెలిచినవి 11, ఓడినవి 6)

* అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) --- 11 మ్యాచ్‌లు (గెలిచినవి 11, ఓడినవి 5)

* హాన్సీ (సౌత్ ఆఫ్రికా) --- 11 మ్యాచ్‌లు (గెలిచినవి 11, ఓడినవి 5, 1 టై)

* కపిల్ దేవ్ (భారతదేశం) --- 11 మ్యాచ్‌లు (గెలిచినవి 11, ఓడినవి 4)

ఐసీసీ వరల్డ్ కప్‌లో సాధించిన ప్రతి పరుగు, ఆడిన ప్రతి మ్యాచ్ ఆటగాడికి ప్రత్యేకమే. ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లో ఆడటం ఓ గొప్ప అవకాశం. ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్‌లో ఒక్క వరల్డ్ కప్‌లోనైనా ఆడాలని తపిస్తుంటారు. కొంత మందికి అవకాశం వస్తుంది. మరికొంత మందికి ఆ అవకాశం దక్కదు.

World Cup cricket records: 10 captains with most matches

భారత్ తరుపున వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఆరు వరల్డ్ కప్‌ల్లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు సచిన్ టెండూల్కరే.

వరల్డ్ కప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు:

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 46 మ్యాచ్‌లు (1996-2011)

సచిన్ టెండూల్కర్ (భారతదేశం) 45 మ్యాచ్‌లు (1992-2011)

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) 40 మ్యాచ్‌లు (1996-2011)

గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా) 39 మ్యాచ్‌లు (1996-2007)

సనత్ జయసూర్య (శ్రీలంక) 38 మ్యాచ్‌లు (1992-2007)

వసీం అక్రం (పాకిస్థాన్) 38 మ్యాచ్‌లు (1987-2003)

జాక్వెస్ కలిస్ (సౌత్ ఆఫ్రికా) 36 మ్యాచ్‌లు (1996-2011)

అరవింద డి సిల్వ (శ్రీలంక) 35 మ్యాచ్‌లు (1987-2003)

ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్) 35 మ్యాచ్‌లు (1992-2007)

బ్రియాన్ లారా (వెస్టిండీస్) 34 మ్యాచ్‌లు (1992-2007)

జవగళ్ శ్రీనాథ్ (భారతదేశం) 34 మ్యాచ్‌లు (1992-2003)

English summary
The ICC World Cup cricket is about to kick off on February 14. The quadrennial event has seen various records set in 40 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X