భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. పోస్టల్‌లో సింహాచ‌లం ప్ర‌సాదం పంపిణీ..

ఏపీలోని ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌లో సింహాచ‌లం అప్ప‌న్న‌స్వామి ఆల‌యం ఒక‌టి. ఇక్క‌డికి నిత్యం భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. సింహాచ‌లం అప్ప‌న్న స్వామి ఆల‌యంలో మే 10 వ తేది నుంచి చంద‌నోత్స‌వ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌లేని భ‌క్తుల‌కు ఆల‌య అధికారులు ఓ శుభ‌వార్త‌ను అందించారు. చంద‌నోత్స‌వం రోజున అప్ప‌న్న స్వామివారిని ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శించుకోలేని వారికోసం ప‌రోక్ష సేవ విధానాన్ని ప్రారంభించారు. భ‌క్తుల కోసం సింహాచ‌లం అప్ప‌న్న‌స్వామి ప్ర‌సాదం, చంద‌నం పోస్ట‌ల్‌లో పంపిణీ చేయ‌నున్నారు.

సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం జ‌రిగే రోజున పరోక్ష అష్టోత్తర శతనామార్చన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో 1,116 రూపాయ‌లు చెల్లించి ఈ పరోక్ష అష్టోత్తర శతనామార్చన సేవ కోసం రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న‌వారి గోత్ర నామాలతో అప్పన్న స్వామి సన్నిధిలో అష్టోత్తర శతనామార్చన జ‌రుపుతారు. అలాగే ఆ భక్తులంద‌ర‌కీ స్వామివారి నిర్మాల్య చందనం, ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా పంపిణీ చేయ‌డం జ‌రుగుతంది.

Good News for Devotees Simhachalam Prasad Distribution Online

చందనోత్సవం రోజు నేరుగా ఆలయంలోని స్వామివారిని ద‌ర్శించుకోలేని భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల‌ని అధికారులు కోరుతున్నారు. ఇక‌, ఈ సేవకు సంబంధించిన తొలి టికెట్‌ను జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున కొనుగోలు చేయ‌డం జ‌రిగంది. భ‌క్తులు ఆన్‌లైన్‌లో డ‌బ్బులు చెల్లించాల‌నుకుంటే మాత్రం ఈ అధికారిక https://www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

నేటి నుంచి ప్ర‌త్య‌క్ష ద‌ర్శ‌నానికి టిక్కెట్లు..

ఇదిలా ఉండ‌గా, ఈ నెల 10వ తేదిన జ‌రిగే చందనోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా కూడా వీక్షించ‌వ‌చ్చు. అలాగే చందనోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. స్వామివారిని నిజరూపంలో దర్శించుకోవవాల‌నుకునేవారు ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ టికెట్లు కూడా నేటి నుంచి అందబాటులోకి రానున్నాయి. అలాగే అప్ప‌న్న‌స్వామి ఆలయంలో ఎన్నికల నియామవళిని పాటిస్తూ దర్శనాలు ఉంటాయని అధికారులు వివ‌రించారు. అటు నిజరూప దర్శనం, ఇటు పరోక్ష సేవ టికెట్లను పొందాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+