Must Read:డబ్బు సంపాదనకు వాస్తు: ఇంట్లో సంప్ బోర్ వెల్‌లు ఎక్కడ ఉండాలి..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటిని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం... ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కానీ సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది. నగలు ఇతర విలువైన పత్రాలు పెట్టె బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.

లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి. బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ భీమ్ క్రింద లేదా దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది. ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తోడ్పడుతుంది. ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి.

What is Vastu saying if one has to save money or earn money

ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపానైననా వెలగనిస్తూ ఉండాలి. ఎందుకంటే కాంతి కూడా ఒక రకమైన శక్తే. ఇది చలనం తీసుకువస్తుంది. ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎంచుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రంగా గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుంది. దీనిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.

మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కారిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పె ట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పెడితే ఆ ఉధృతి తగ్గుతుంది.

ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా ఆకర్షణీయమైన రంగులు వేసుకోవాలి.

ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి.

ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట. కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వాటిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్ర ధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుంది. ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.

Recommended Video

    #Astrology : 7 Zodiac Signs Most Likely To Become Rich || Oneindia Telugu

    మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి. ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది. ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి. సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్వాలేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+