keyboard_backspace

Vishwakarma భగవంతుడిని ఎలా పూజించాలి..ఎలాంటి పనిముట్లు ముందుంచాలి..?

Google Oneindia TeluguNews

సనాతన ధర్మంలో, విశ్వకర్మ దేవుడు సృష్టి అని సృష్టికి దేవుడిగా పరిగణించబడ్డాడు. అంతేకాదు అన్ని దేవుళ్లకు ఆయన ఒక ఇంజినీర్‌గా వ్యవహరిస్తారని చెబుతారు. ప్రతి సంవత్సరం కన్యా సంక్రాంతి రోజున విశ్వకర్మ పూజ జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ రోజున విశ్వకర్మ దేవుడు జన్మించాడు.

పురాణాల ప్రకారం విశ్వకర్మ భగవానుడు ఒక ఇంజినీర్‌గా చెప్పబడ్డాడు. విశ్వకర్మ భగవానుడి జయంతి ఏటా కన్యా సంక్రాంతి రోజున జరుపుకుంటారు. కన్యా సంక్రాంతి 2021లో సెప్టెంబర్ 17వ తేదీన వచ్చింది. ఈ రోజు విశ్వకర్మ జయంతితో పాటు పద్మ ఏకాదశి కూడా ఒకే రోజున వచ్చింది. రుగ్వేదంలో 12 ఆదిత్యులు మరియు లోకపాలకులతో పాటు విశ్వకర్మ దేవుడి గురించి కూడా ప్రస్తావించబడింది. దీంతో విశ్వకర్మ భగవంతుడిపై నమ్మకం పురాణాల నుంచే ఉందన్న విషయం అర్థమవుతోంది.

Vishwakarma jayanti is the day that is dedicated to the creator.

పురాణాల ప్రకారం విశ్వకర్మ దేవుడు కన్యా సంక్రాంతి రోజున జన్మించినట్లు తెలుస్తోంది. విశ్వకర్మ జయంతి రోజున ఎలా పూజించాలి, విశ్వకర్మ భగవంతుడిని పూజించేందుకు శుభ సమయం ఏంటి, ఈ రోజు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. విశ్వకర్మ జయంతి రోజున పూజ సమయంలో పనిముట్లు, నిర్మాణ పనులకు సంబంధించిన యంత్రాలు, కర్మాగారాలు, దుకాణాలు, మొదలైన వాటిని పూజిస్తారు. విశ్వకర్మను ఆరాధించడం ద్వారా జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు ఎప్పుడూ లోపించదని అంటారు.

హిందూ మత విశ్వాసం ప్రకారం సృష్టిని బ్రహ్మదేవుడు సృష్టించి దానిని అందంగా తీర్చిదిద్దే బాధ్యతను విశ్వకర్మ దేవుడికి ఇచ్చారని తెలుస్తోంది. విశ్వకర్మ భగవానుడు ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప ఇంజినీర్‌గా పేర్కొనబడ్డాడు. విశ్వకర్మ దేవుడు బ్రహ్మజీ కుమారుడైన వాస్తు కుమారుడు అని కూడా నమ్ముతారు. ఇక శివుడి కోసం త్రిశూలం, విష్ణువు కోసం సుదర్శన చక్రం, యముడి కోసం కల్దండ, కృష్ణుడి కోసం ద్వారకా, పాండవుల కోసం ఇంద్రప్రస్థానం, రావణుడి కోసం లంక, ఇంద్రుని కోసం వజ్ర వంటివి సృష్టించాడని కూడా పెద్దలు చెబుతారు.

Vishwakarma jayanti is the day that is dedicated to the creator.

గ్రంథాలలో విశ్వకర్మ దేవుడిని బ్రహ్మ కుమారుడని రాయబడిఉంది. అతను స్వర్గలోకం, పుష్పక విమానం, ద్వారకా నగరం, యమపురి, కుబేరపురి మొదలైన వాటిని నిర్మించారని గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాదు సత్యయుగ స్వర్గాన్ని, త్రేతయుగం లంకను, ద్వాపర యుగంలో ద్వారక నగరాలను నిర్మించాడని గ్రంథాలు చెబుతున్నాయి. కార్మిక సంఘాలతో అనుబంధం ఉన్న వ్యక్తులకు విశ్వకర్మ జయంతి చాలా ప్రాముఖ్యమైన రోజు. విశ్వకర్మ జయంతి రోజున అన్ని కర్మాగారాలు మరియు పారిశ్రామిక సంస్థల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Vishwakarma jayanti is the day that is dedicated to the creator.

ఇక విశ్వకర్మ జయంతి రోజున ఏ సమయం పూజకు అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 17- శుక్రవారం ఉదయం 6:07 నుంచి 18 సెప్టెంబర్ శనివారం మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల వరకు పూజలు నిర్వహించొచ్చు. రాహుకాలంలో మాత్రం పూజలను నిషేధించవచ్చు. సెప్టెంబర్ 17 శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం ఉంది. ఇది మినహాయిస్తే మిగతా సమయమంతా పూజలకు అనుకూలంగా ఉంటుంది.

భగవాన్ విశ్వకర్మను ఈ విధంగా పూజించండి

విశ్వకర్మ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందుగా నిద్ర లేవాలి

స్నానం చేసి విశ్వకర్మ పూజ సామగ్రిని సేకరించండి. కుటుంబంతో పూజను ప్రారంభించండి.

భార్యా భర్తలు కలిసి పూజిస్తే ఇంకా మంచిది.

పూజ చేసే చేతితో బియ్యం తీసుకుని విశ్వకర్మ దేవుడిని ధ్యానించండి

అదే సమయంలో విశ్వకర్మ దేవుడికి తెల్లని పూలను సమర్పించండి

దీని తర్వాత ధూప ధీప పుష్పాలతో స్వామివారిని పూజించండి

ఆ తర్వాత మీ వద్ద కలిగి ఉన్న పనిముట్లు,యంత్రాలను ఇతర సాధనాలను విశ్వకర్మ భగవానుడి ముందుంచి పూజచేయండి.

చివరిగా విశ్వకర్మ భగవానుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేయండి.

తెలుసుకున్నారుగా విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా ఆయన్ను ఎలా ఏ సమయంలో పూజించాలో. ఇవన్నీ తూచా తప్పక పాటించి భగవంతుడి ఆశీర్వాదం పొందండి.

English summary
Vishwakarma jayanti is the day that is dedicated to the creator.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X