keyboard_backspace

World Heart day 2021: హెల్తీ హార్ట్ కోసం ఎలాంటి ఆహారం తీసుకవాలి..ఏ వ్యాయామాలు చేయాలి?

Google Oneindia TeluguNews

కరోనావైరస్ మహమ్మారి మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా తెలిపింది. కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో ప్రజలు క్రమంగా తమ ఆరోగ్యాలపై దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఇక ఆరోగ్య విషయానికొస్తే చాలామంది గుండెపోటుతో లేదా గుండె సంబంధిత వ్యాధులతో అకాల మరణం చెందుతున్నారు. ఇందుకోసమే గుండెకు సంబంధించి లేదా ఆరోగ్యవంతమైన గుండె కోసం ఏం చేయాలి అనేదానిపై అవగాహన తీసుకొచ్చేందుకు ఏటా 29న వరల్డ్ హార్ట్ డేను పాటిస్తున్నారు. ఇది ఎప్పుడు ఎందుకు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం...

సెప్టెంబర్ 29..అంతర్జాతీయ హృదయ దినోత్సవం ఇంగ్లీషులో వరల్డ్ హార్ట్ డేను జరుపుకుంటున్నాం. 2000వ సంవత్సరంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్‌ ఏటా వరల్డ్ హార్ట్ డేను జరుపుకోవాలంటూ సూచించింది.ఇక అప్పటి నుంచి ఆరోగ్యవంతమైన గుండెకు కావాల్సిన అన్ని జాగ్రత్త చర్యలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. మంచి ఆరోగ్యవంతమైన గుండె కోసం మనం తక్కువలో తక్కువగా చేయగలిగింది మంచి ఆహారం తీసుకోవడమే. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా క్రొవ్వు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది గుండెకు హాని తలపెడుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇక గుండెను కాపాడుకునేందుకు ఈ ఐదు ఆహార పదార్థాలను తీసుకోండి

బార్లీ

బార్లీ

శరీరంలో క్రొవ్వును కరిగించేందుకు అదే సమయంలో క్రొవ్వు చేరకుండా ఉండేందుకు మనం తీసుకునే ఆహారంలో బార్లీ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.లివర్‌లో క్రొవ్వు ఉత్పత్తిని కూడా ఇది తగ్గిస్తుంది. తద్వారా లిపిడ్ లెవెల్‌ను ఇది నియంత్రణలో ఉంచుతుంది.

బెర్రీలు

బెర్రీలు

బెర్రీలు ఎప్పటికీ ఇష్టపడతారు. అంతేకాదు బెర్రీల్లో రకరకాలున్నాయి. స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీలు,బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీలున్నాయి. గుండె ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఈ బెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో అధిక పోషకాలు ఉంటాయి. బెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆక్సీకరణ ఒత్తిడి నుంచి గుండెలో కలిగే మంట నుంచి కాపాడుతాయి.

మిక్స్‌డ్‌నట్స్

మిక్స్‌డ్‌నట్స్

ఆరోగ్యకరమైన గుండె కోసం నట్స్ తీసుకోవాలి. వీటిలో పీచు పదార్థం పుష్కలంగా ఉండటంతో పాటు ప్రొటీన్లు కూడా ఉంటాయి. కొన్ని నట్స్‌లో క్రొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి వాటిని మీరు పక్కన పెట్టేయొచ్చు.అది కూడా జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ స్నాక్స్‌లో వినియోగించే నట్స్‌లో మాత్రమే ఉంటుంది.

చేప

చేప

గుండెలో మంట కలిగితే తీవ్ర గుండె సంబంధిత వ్యాధులు కలిగే అవకాశాలున్నాయి. అందుకే వీటి నుంచి గుండెను కాపాడుకోవాలంటే మంచి చేపలు ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ట్యూనా, సాల్మన్ ట్రౌట్ చేపలు తీసుకుంటే మంచిది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉండే చేపలు గుండెలో మంట నుంచి రక్షిస్తాయి.ఒకవేళ చేపలకు దూరంగా ఉన్నట్లయితే ఇదే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ఓట్‌ మీల్

ఓట్‌ మీల్

ప్రతి రోజు మీరు ఉదయం తీసుకునే అల్పాహారంలో ఒకటిన్నర కప్పు వండిన ఓట్ మీల్స్‌ను చేరిస్తే మీ గుండె ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటుంది. గుండెకు కావాల్సిన బీటా-గ్లూకాన్ సరైన నిష్పత్తిలో ఉండాలి. ఓట్‌మీల్‌లో ఉండే పీచుపదార్థం ఎల్‌డీఎల్ కొలస్ట్రాల్‌ను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్ చేరిస్తే మంచి పోషకాలు అందడంతో పాటు ఆరోజు మొత్తం చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

తీసుకునే ఆహారంతో పాటు మంచి వ్యాయామాలు చేస్తే కూడా గుండె జబ్బులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా జుంబా డ్యాన్స్‌ చేయాలని సూచిస్తున్నారు. జుంబా డ్యాన్స్‌లో ఫన్‌తో పాటు శరీరంకు కావాల్సిన వ్యాయామం దొరుకుతుందని చెబుతున్నారు. బరువు తగ్గడం, బాడీ టోనింగ్‌లో జుంబా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో జుంబా డ్యాన్స్ ఉపయోగపడుతుంది. ఇక వాకింగ్ చేయడం కూడా గుండెకు మంచిది. సైక్లింగ్ చేయడం వల్ల ఒంట్లో క్రొవ్వు కరిగిపోతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు. స్క్వాట్స్‌ కూడా కండరాలను బలంగా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ బాగా జరిగి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఎగరడం లేదా స్కిప్పింగ్ వంటి ఎక్సర్‌సైజులు కూడా ఆరోగ్యవంతమైన గుండెకు దోహదపడుతాయి.

ఇక ప్రపంచంలో ఏటా 18.6 మిలియన్ మరణాలు కార్డీవాస్క్యులర్ డిజీస్ ద్వారానే సంభవిస్తున్నాయి. గుండె జబ్బుల నుంచి సంభవించే మరణాల్లో దాదాపు 80శాతం మరణాలు గుండె పోటు ద్వారానే సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుండె సంబంధిత వ్యాధులపై అవగాహప కల్పించేందుకు లేదా తీసుకొచ్చేందుకు సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్‌ డేగా పరిగణిస్తున్నారు.

English summary
September 29th is observed as World health day.on this day awareness is created so as to have a healthy heart.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X