"ఈ నగరానికి ఏమైంది" సీక్వెల్లో ఆ నటుడు అవుట్.. డైరెక్టర్ షాకింగ్ పోస్ట్ !!
2018లో విడుదలై యూత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ యూత్ ఎంటర్‌టైనర్ "ఈ నగరానికి ఏమైంది". ఇప్పటికీ తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఫ్రెండ్షిప్, డ్రీమ్స్, ఫెయిల్యూర్స్, ఫిల్మ్‌మేకింగ్ జర్నీని సహజంగా చూపించింది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను పాత్రలు యువతను బాగా కనెక్ట్ చేశాయి.
ఈ సినిమాకు వచ్చిన స్పందనతోనే "ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు?" అనే ప్రశ్న ఏడేళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఆ అంచనాలకు తెరదించుతూ దర్శకుడు తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది?' సీక్వెల్‌ను 'ఈNఈ రిపీట్' అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను - మళ్లీ తమ పాత్రల్లో కనిపించనున్నారని మొదట క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేశ్ బాబు, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సుశాంత్ ఔట్.. ఫ్యాన్స్‌కు షాక్
అయితే ఈ సీక్వెల్ ప్రయాణంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. విశ్వక్ గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషించిన సాయి సుశాంత్ రెడ్డి పార్ట్ 2లో భాగం కావడం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాదు, ఆ పాత్రకు 'హిట్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటి రీప్లేస్ అవుతున్నాడన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక లాంగ్ నోట్ విడుదల చేసి పూర్తి స్పష్టత ఇచ్చారు.
తరుణ్ షాకింగ్ పోస్ట్..
సుశాంత్ కేవలం వ్యక్తిగత కారణాల వల్లే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. అతను ఈ సినిమాలో భాగం కాదని తెలిసినప్పుడు కొంతకాలం షాక్‌లోకి వెళ్లిపోయాను. అసలు ఈ సినిమా చేయాలా వద్దా అనే డైలమాలో కూడా పడ్డాను. కేవలం డబ్బు కోసం సినిమా తీయడం నాకు ఇష్టం లేదు. కథలో ఆ ఫ్రెండ్షిప్ వైబ్ పర్ఫెక్ట్‌గా కుదిరితేనే ముందుకు వెళ్లాలనుకున్నాను" అని రాసుకొచ్చారు. అయితే స్క్రిప్ట్‌ను పలుమార్లు విశ్లేషించిన తర్వాత కార్తీక్ పాత్రను మరో కోణంలో చూపిస్తూ సినిమాను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇక సుశాంత్ ఈ ప్రయాణంలో లేకపోయినా, కార్తీక్ పాత్ర మాత్రం సినిమాలో తప్పకుండా ఉంటుందని తరుణ్ భాస్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తనలో కాన్ఫిడెన్స్ పెరిగిందని, ప్రేక్షకులు ఆశించే అదే మ్యాజిక్ మరోసారి తెరపై రిఫ్లెక్ట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ పాత్రకు మరో నటుడిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనాథ్ మాగంటి పేరు వినిపించడం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో ఒక సినిమా హిట్ అయితే వెంటనే దానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ప్రకటించడం సాధారణంగా మారింది. అయితే అన్ని సీక్వెల్స్ వర్క్ అవ్వవు అన్నది కూడా నిజం. కథ, పాత్రలు, ఎమోషన్‌ను అదే స్థాయిలో నిలబెట్టగలిగితేనే సీక్వెల్ సక్సెస్ అవుతుంది. ఈ విషయాన్ని 'పుష్ప 2' లాంటి సినిమాలు నిరూపించాయి. అదే కోవలో ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది?' కూడా ప్రేక్షకులకు మరోసారి ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందనే నమ్మకం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ ! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్












Click it and Unblock the Notifications