రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !!

మెగా డాటర్ నిహారిక ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇన్నాళ్లు నటిగా సత్తా చాటిన ఆమె.. ఇప్పుడు నిర్మాతగా టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా ఆమె నిర్మిస్తున్న చిత్రం "రాకాస". మానస శర్మ దర్శకత్వం వహించగా.. నయన్‌సారిక హీరోయిన్ గా చేసింది. ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలోనే రాకాస సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌ విషయంలో అందరికీ షాక్ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 12.5 కోట్లు పలకగా.. ఓవర్సీస్ హక్కులు రూ. 2.25 కోట్లు.. మిగిలిన భారతదేశ హక్కులు కలిపి రూ. 1.25 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.16 కోట్ల మార్కును అందుకుందని అంటున్నారు.

niharika-konidala-producing-rakasa-movie-geting-positive-reports-according-to-pre-release-business-i

అంతే కాకుండా ఓటీటీ హక్కులు ఏకంగా రూ.10 కోట్లకు డీల్ ఓకే అవ్వగా.. ఆడియో హక్కులు రూ. 1 కోటికి అమ్ముడుపోవడం విశేషం. కానీ హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలెక్కన చూస్తే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. థియేట్రికల్ రన్ ద్వారా కనీసం రూ.17 కోట్ల షేర్ (సుమారు రూ. 32 కోట్ల గ్రాస్) వసూలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రమోషన్లు గట్టిగా చేస్తుండటంతో ఓపెనింగ్స్ బాగుంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి చిన్న సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం అంటే ఆ క్రెడిట్ అంతా నిహారికకే దక్కుతుందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరి ముఖ్యంగా గతంలో ఆమె నిర్మించిన "కమిటీ కుర్రోళ్లు" మంచి హిట్ అందుకుంది. అలానే పలు అవార్డులను సైతం కైవసం చేసుకోవడంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయని భావిస్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా.. నిహారిక కొణిదెల నిర్మాణంలో కొత్త మూవీ "బరి" స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టు ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక నిహారిక విషయానికి వస్తే.. నాగబాబు కుమార్తెగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించింది. "ముద్దపప్పు అవకాయ" సహా పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సైతం యాంకర్ గా సత్తా చాటింది. ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి "ఒక మనసు" చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు పొందగలిగింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోవడంతో.. నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+