అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య అద్భుతమైన స్నేహం ఉంది. వీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి సినిమాలపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్‌కు మహేష్ బాబు నటించిన సినిమాల్లో 'ఒక్కడు' అంటే బాగా ఇష్టం. చాలా సందర్భాల్లో బన్నీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మహేష్ బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'ఒక్కడు' సినిమా అల్లు అర్జున్‌కు అత్యంత ఇష్టం. గుణశేఖర్ దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమా టేకింగ్, మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, మణిశర్మ సంగీతం, ప్రకాష్ రాజ్ నటన తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా చార్మినార్ సెట్, కబడ్డీ సీన్, మహేష్ బాబు చూపించిన 'మాస్ అండ్ క్లాస్' నటనకు తాను పెద్ద ఫ్యాన్ అని ఆయన చెప్పారు.

తనపై ఒక్కడు, పోకిరి ప్రభావ ఉంది

కేవలం 'ఒక్కడు' మాత్రమే కాకుండా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'పోకిరి' సినిమా ప్రభావం కూడా తనపై ఉందని అల్లు అర్జున్ చెప్పారు. ఆ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ అప్పట్లో టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయని, ఆ సినిమా చూసినప్పుడు మహేష్ బాబు మేనరిజమ్స్‌కు తాను ఫిదా అయ్యానని బన్నీ ప్రశంసించారు. అప్పటి నుండి మహేష్ బాబును ఒక స్టైల్ ఐకాన్‌గా తాను గమనిస్తూ ఉంటానన్నారు. వీరిద్దరూ ఒకర్నొకరు గౌరవించుకోవడం, ఒకరి సినిమాలను మరొకరు ప్రశంసించుకోవడం ఇరువైపులా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని, అందులో బన్నీ నటనకు తాను పెద్ద ఫ్యాన్ అని మహేష్ బాబు స్వయంగా చెప్పారు. ఆ సమయంలో అల్లు అర్జున్ ప్రిన్స్ ను 'ది మోస్ట్ చార్మింగ్ స్టార్' అని సంబోధిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Allu Arjun Do you know what the favorite movie of Icon Star among superstar Mahesh Babu films

పాన్ వరల్డ్ హీరోగా మారుతున్న మహేష్ బాబు

పెద్ద పెద్ద హీరోలు ఇలా ఒకర్నొకరు గౌరవించుకోవడం లాంటి పరిణామాలు సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందని, పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి హీరో ఇలాగే ఉండాలని, మనస్ఫూర్తిగా మహేష్ బాబు అభినందించినట్లు, అందరు హీరోలు , ఇతర హీరోల సినిమాలను కొనియాడటం, వారి నటనను మెచ్చుకోవడం, అభినందించడంలాంటివి చేస్తే చాలని, తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని, ఎటువంటి రాజకీయాలకు తావుడందని అంటున్నారు. అలా ఉండాలని అందరూ హీరోల అభిమానులు కోరుకుంటారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల కాబోతోంది. ఒకరకంగా అద్భుతమైన విజువల్ వండర్ గా దర్శక ధీరుడు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ హీరో అయినట్లేనని అభిమానులు సంబరపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+