12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’

భారతీయ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తూ, సరికొత్త రికార్డుల సునామీతో 'ధురంధర్-2' దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, కేవలం 12 రోజుల్లోనే రూ.1390 కోట్లను సాధించింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ధురంధర్-2: ది రివెంజ్', బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే రూ. 1,392.23 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి, భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంది. ధురంధర్ మొదటి భాగం రూ. 1,350 కోట్లు సాధించింది.

కర్ణాటకలో తొలి హిందీ సినిమాగా

ఈ చిత్రం కేవలం ఇండియాకే పరిమితం కాకుండా, విదేశాల్లోనూ రికార్డులను బద్ధలు కొడుతోంది. మన దేశంలో రూ. 1,042 కోట్లకు పైగా, విదేశాల్లో రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఉత్తర అమెరికా, కెనడా మార్కెట్లలో 22.7 మిలియన్ డాలర్లను వసూలు చేయడం ద్వారా, 9 ఏళ్ల క్రితం 'బాహుబలి-2' నెలకొల్పిన రికార్డును ధురంధర్-2 చెరిపేసింది. దక్షిణాది మార్కెట్‌లో ఈ సినిమా సృష్టించిన రికార్డు అత్యంత విశేషమైనది. కర్ణాటకలో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి హిందీ సినిమాగా 'ధురంధర్-2' చరిత్ర సృష్టించింది. కేవలం బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతూ, బాహుబలి-2 స్థాయిలో వచ్చిన స్పందనను దక్కించుకుంది.

Dhurandhar 2 Rewrites History Ranveer Singh Starrer Block Buster Movies Collects 1400cr in 12 days

త్వరలోనే నెం.1 స్థానానికి

ఇప్పటివరకు మన భారతీయ చిత్రాల్లో నెం.1 స్థానంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ ఉంది. ఈ సినిమా రూ.2వేల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇండియా, చైనాలో కలిపి ఈ స్థాయి కలెక్షన్లు సాధ్యమయ్యాయి. ఒక్క చైనాలోనే ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్ వచ్చింది. అక్కడ క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. దంగల్ కు అది కలిసివచ్చింది. తర్వాత బాహుబలి రూ.1810 కోట్లు, పుష్ప2 రూ.1800 కోట్లు, ధురంధర్ 2 రూ.1400 కోట్లు కొల్లగొట్టాయి.

ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తున్నా సాయంత్రం ఆటలు కూడా హౌస్ ఫుల్ అవుతుండటమే విశేషం. కరాచీలోని లియారీ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌లో రణవీర్ సింగ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయి. దాదాపు 4 గంటలు ఈ సినిమా ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకపోవడమే ఈ స్థాయి విజయానికి ప్రధాన కారణం. త్వరలోనే దంగల్ రికార్డులను కూడా బద్దలు కొట్టి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన నెం.1 సినిమాగా ధురంధర్2 నిలిచే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+