టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ!
టాలీవుడ్ సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. సమాజంలో సినిమా హీరోలు రోల్ మోడల్స్‌గా ఉంటారని.. వారిని అనుసరించే యువత పెడదోవ పెట్టకుండా ఉండాలంటే నటులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ వింత ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. నటులు ప్రతి 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని.. ఆ రిపోర్టులను బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా డ్రగ్స్ పరీక్షలో నెగటివ్ వస్తేనే ఆ హీరోల సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలనే నిబంధన పెట్టాలని ఎమ్మెల్యే కోరడం చర్చనీయాంశంగా మారింది.
రంగంలోకి దిగిన మా అధ్యక్షుడు మంచు విష్ణు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు గట్టిగా స్పందించారు. యాక్టర్లు ఇలాంటి పరీక్షలకు సిద్ధమని చెప్తూనే.. జవాబుదారీతనం అనేది కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాకూడదని మంచు విష్ణు స్పష్టం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎలాంటి పరీక్షలు చేయించుకుంటున్నారో సమాజానికి చెప్పగలరా అంటూ విష్ణు సవాల్ విసిరారు. బాధ్యత, పారదర్శకత అనేవి సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులకు కూడా సమానంగా వర్తించాలని విష్ణు పరోక్షంగా చురకలంటించారు.

రాహుల్ రామకృష్ణ 'లై డిటెక్టర్' ఛాలెంజ్
మరోవైపు ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించాడు. కేవలం హీరోలే కాదు, తనలాంటి నటులు కూడా డ్రగ్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని రాహుల్ రామకృష్ణ. అయితే దీనికి ప్రతిగా పొలిటీషియన్స్ కూడా ఒక పరీక్షకు సిద్ధపడాలని ఆయన సవాల్ విసిరారు. నాయకులు ప్రజలకు ఇచ్చే హామీలు, వారు చేసే వాగ్దానాల్లో ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోవడానికి వారికి 'లై డిటెక్టర్' (అబద్ధాలు కనిపెట్టే) పరీక్షలు నిర్వహించాలని రాహుల్ రామకృష్ణ అన్నాడు. ఈ వివాదం నేపథ్యంలో మంచు విష్ణుతో పాటు రాహుల్ రామకృష్ణ చేసిన ఈ సెటైరికల్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
చర్చకు దారితీసిన వివాదం
ముందుగా కేవలం డ్రగ్స్ టెస్టుల చుట్టూ తిరిగిన ఈ వివాదం.. ఇప్పుడు రాజకీయ నాయకుల జవాబుదారీతనంపై చర్చకు దారితీసింది. ఓ సినిమా విడుదలకు హీరో వ్యక్తిగత మెడికల్ రిపోర్టుకు సంబంధం ఏంటని చిత్ర పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అదే సమయంలో సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ చేయడం మానుకోవాలని, పారదర్శకత అనేది వ్యవస్థలోని అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో కూడా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ టాలీవుడ్ వర్సెస్ పాలిటిక్స్ యుద్ధం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
-
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..












Click it and Unblock the Notifications