తెలుగులో తొలి ఏఐ సినిమా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ.. పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా "అంబ's రివెంజ్" వార్తల్లో నిలిచింది. సాంకేతికతను పౌరాణిక గాథతో ముడిపెడుతూ నిర్మిస్తున్న ఈ సినిమా ఓ చారిత్రాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

మహాభారత గాథకు ఏఐ హంగులు
మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన, భావోద్వేగపూరితమైన పాత్ర 'అంబ' కథ ఆధారంగా ఈ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంబ ప్రతిజ్ఞ, ఆమె పడే సంఘర్షణను ఆధునిక ఏఐ టెక్నాలజీని వినూత్నంగా ఆవిష్కరిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

First Telugu AI Movie Amba s Revenge Tollywood First Full-Length AI Feature Film Set to Revolutionize Telugu Cinema

అత్యాధునిక టెక్నాలజీతో పాత్రల రూపకల్పన
ఈ చిత్రం కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నట్లు క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి వెల్లడించారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా పాత్రల రూపకల్పన, స్క్రీన్‌ప్లే, గ్రాఫిక్స్ వంటి ప్రతి అంశంలోనూ కృత్రిమ మేధను వాడుతూ సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. సంప్రదాయ చిత్ర నిర్మాణానికి భిన్నంగా, టెక్నాలజీని గరిష్ట స్థాయిలో ఉపయోగిస్తూ తక్కువ సమయంలోనే నాణ్యమైన అవుట్ పుట్ తీసుకురావడం ఈ సినిమా ప్రధాన ఉద్దేశం.

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం
తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది ఓ కీలకమైన అడుగుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హనుమాన్ విజయోత్సవం వంటి పవిత్రమైన రోజున టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. పౌరాణిక ఇతివృత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మిళితం చేయడం అనేది ప్రేక్షకులకు ఓ సరికొత్త విజువల్ వండర్‌గా నిలుస్తుందని సినీ మేకర్స్ నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే, రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలో ఏఐ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వినూత్న ప్రయోగం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+