బచ్చలి కూర పచ్చడి.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఆకుకూరల్లో విటమిన్ ఏ, సీ, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇక బచ్చలి కూరను ఆకుకూరల్లో రారాణిగా పిలుస్తుంటారు. దీన్ని పప్పులో వేసినా.. పచ్చడి చేసినా.. పెరుగు పులుసు చేసినా సూపర్ టేస్టీగానే ఉంటుంది. మరి సూపర్ టేస్టీ బచ్చలికూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బచ్చలికూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బచ్చలి కూర కట్టలు మూడు లేదా నాలుగు, ఎండుమిర్చి పదిహేను, పచ్చిమిర్చి ఐదారు, నూనె తగినంత, చింతపండు కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, మెంతులు ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి.
ఇక బచ్చలికూర పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా బచ్చని కూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఓ టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆ మిశ్రమంలో ధనియాలు, మెంతులు వేసి వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూర తరుగు, చింతపండు, పచ్చిమిర్చి తుంపలు వేసి కలపాలి. అలా బచ్చలి కూరను మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండుమిర్చి తాలింపు, బచ్చలికూర వేపుడు, ఉప్పు తగినంత వేసుకుని కాస్త బరకగా గ్రైండింగ్ చేసుకోవాలి. అంతే నోరూరించే బచ్చలికూర పచ్చడి రెడీ అయినట్టే..
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
అమ్మకు భరోసా.. మూడు దశాబ్దాల ప్రస్థానంలో భారత్ విజయగాథ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications