ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్

భోజ్‌పురి స్టార్ నటి, బిగ్‌బాస్ ఫేమ్.. టెలివిజన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మోనాలిసా సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. సిద్దార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ తొలినాళ్లలో తక్కువ బడ్జెట్ సినిమాల్లో నటించేటప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లు, లిప్‌లాక్ దృశ్యాల చిత్రీకరణ సమయంలో కొందరు నటులు ప్రవర్తించిన తీరుపై మోనాలిసా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హద్దులు దాటిన నటుడు.. డైరెక్టర్‌తో గొడవ!
ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ.. "ఓ ఇంటిమేట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు సహ నటుడు తన హద్దులు దాటి ప్రవర్తించాడు. డైరెక్టర్ కట్ అని చెప్పినప్పటికీ.. అతను వినలేదు. సీన్ ఆపేయమన్నందుకు దర్శకుడితో కూడా వాదనకు దిగాడు. ఆ సమయంలో సెట్లో ఉన్నవాళ్లంతా చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యారు" అని మోనాలిసా చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత టీమ్ అంతా కలిసి పరిస్థితిని చక్కదిద్ది షూటింగ్ పూర్తి చేశారని ఆమె వెల్లడించారు.

Bhojpuri Actress Monalisa Shocking Casting Couch and Intimate Scene Revelations in Interview

ఆర్థిక ఇబ్బందుల వల్లే బీ-గ్రేడ్ సినిమాలు
తన కెరీర్ ఆరంభంలో బీ-గ్రేడ్ సినిమాల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో కూడా ఆమె కుండబద్దలు కొట్టారు. "అప్పట్లో నాకు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉండేవి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి వేరే దారి లేక అటువంటి ప్రాజెక్టులను అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ సినిమాలే నాకు గుర్తింపు తెచ్చాయి. నా పోరాటంలో అదొక భాగం తప్ప, దాని గురించి నేను ఇప్పుడు ఏమాత్రం బాధపడటం లేదు" అని మోనాలిసా స్పష్టం చేశారు.

ముద్దు సీన్లపై అభ్యంతరం లేదు కానీ..
ఇంటిమేట్, లిప్‌లాక్ సీన్లపై తన అభిప్రాయాన్ని చెబుతూ.. "కథ డిమాండ్ చేస్తే ఓ ప్రొఫెషనల్ పద్ధతిలో అటువంటి సీన్లు చేయడంలో తప్పు లేదు. హిందీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ కూడా ఇలాంటి సీన్లు చేస్తున్నారు. అయితే షూటింగ్ కు ముందే టీమ్ అందరితో చర్చించి నటీనటులు కంఫర్టబుల్‌గా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. కెమెరా ముందు నేను ఓ వ్యక్తిగా కాకుండా, కేవలం ఆ పాత్రగానే ఆలోచిస్తాను" అని మోనాలిసా వివరించారు. సినిమా అంటే ఒక టీమ్ వర్క్ అని, నటీనటుల మధ్య పరస్పర గౌరవం, ప్రొఫెషనలిజం ఉంటేనే ఇటువంటి సున్నితమైన దృశ్యాలను సౌకర్యవంతంగా చిత్రీకరించగలమని ఆమె అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+