తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!
స్టార్ బ్యూటీ శ్రీలీల.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి "పెళ్లి సందD" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన గ్లామర్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డాన్స్ స్కిల్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన "ధమాకా" సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి.. ఆమెకు మాస్ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప 2లోని "కిస్సిక్" అనే ఐటమ్ సాంగ్‌లో ఆమె చేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఇక హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా శ్రీలీల కెరీర్ ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గానే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు రాశీఖన్నా కథానాయికగా నటించారు. Mythri Movie Makers బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

'గబ్బర్ సింగ్' తరహా మాస్ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేస్తుందనే అంచనాలతో వచ్చిన ఈ సినిమా పబ్లిక్ టాక్ విషయంలో బజ్ ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ శ్రీలీల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ అవుతోంది.
శ్రీలీల ఈ రేంజ్ లో ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటంటే.. లేడీ సూపర్ స్టార్ అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అరుంధతి అని చెప్పాలి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. 2009 లో రిలీజైన ఈ సినిమా ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అరుంధతిగా అనుష్కను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేనంత విధంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ మీడియాలో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ తెరకెక్కించిన మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు చేపట్టనున్నట్టు టాక్. కాగా అనుష్క ప్లేస్ లో అందాల భామ శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారట. అమ్మడు డ్యాన్సర్ కావడంతో.. అనుష్కను మ్యాచ్ చేస్తుందని అనుకుంటున్నారట. జేజమ్మ పాత్రలో అనుష్క పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ శ్రీలీలా విషయానికి వస్తే మాత్రం అనుష్కను అసలు ఎలా మ్యాచ్ చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆమె కటౌట్ కి ఈమె కటౌట్ కి పోలిక అసలు ఉందా అంటూ జోక్స్ వేస్తున్నారు. వరుస ఫ్లాప్ లతో ఉన్న ఈ భామ ఖాతాలో మరో ఫ్లాప్ గ్యారంటీ అని పోస్టులు పెడుతున్నారు. మరి ఈ రీమేక్ విషయంలో నిజమెంత.. అబద్ధమెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications