బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!
ఇటీవలి కాలంలో పొట్ట భాగంలో చాలామందికి కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయులు సైతం పెరిగిపోతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లైఫ్ ఇలా అనేక కారణాలతో ఊబకాయులు పెరిగిపోతున్నారు. అయితే అలాంటి వారు సన్నగా నాజూగ్గా కావాలంటే ఈ జ్యూస్ తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జిమ్ లకు వెళ్లకుండా కేవలం ఇంట్లో ఉండే ఈ జ్యూస్ చేసుకుని తాగితే స్పీడ్ గా వెయిట్ లాస్ అవుతారని చెబుతున్నారు. మరి ఈ ఆరోగ్యకరమైన సొరకాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
ఈ సొరకాయ జ్యూస్ ను ఖాళీ కడుపుతో ఒక నెల రోజులపాటు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి పోతుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ బీ, విటమిన్ కే, ఐరన్, పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ సొరకాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి..? ముందుగా సొరకాయ ముక్కలు తగినన్ని, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు తగినంత, అల్లం తరుగు తీసుకోవాలి.

ఇప్పుడు లేత సొరకాయను తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తమీరను కూడా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో సొరకాయ ముక్కలు వేయాలి. వాటితోపాటే అల్లం, జీలకర్ర, కొత్తిమీర, తగినంత ఉప్పు, రుచికోసం నిమ్మరసం వేయాలి. కొన్ని నీళ్లు పోయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుని ఓ గ్లాసులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ హెల్దీ సొరకాయ జ్యూస్ ను రోజూ తాగాలి.












Click it and Unblock the Notifications