అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!
నవయువ సామ్రాట్ అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2015లో అఖిల్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటి వరకూ దాదాపు 7 సినిమాల్లో నటించారు. 2023 లో ఏజెంట్ మూవీ ప్లాఫ్ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం 'లెనిన్'. ఈ మూవీపై అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. లెనిన్ తో అక్కినేని అఖిల్ భారీ విజయం అందుకుంటారని అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక లెనిన్ మూవీ వాస్తవానికి మే 1 న విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇంతలోనే అఖిల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లెనిన్ మూవీని పోస్ట్ పోన్ చేస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 11ఏళ్లు అవుతుంది. ఇప్పటివరకూ అఖిల్ 6 సినిమాలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. హీరోగా నిలబడలేకపోతున్న ఆయన చేతికి లెనిన్ స్క్రిప్ట్ అందింది. ఇప్పటికే రిలీజైన లెనిన్ మూవీ గ్లింప్స్ చూస్తే మూవీ అద్భుతంగా ఉండబోతుందని అర్థమైతుంది. ఈ మూవీలో అఖిల్ ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నారు. అయితే అఖిల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఏప్రిల్ 30 న విడుదల కానున్న నేపథ్యంలో.. మే 1 న రిలీజ్ కానున్న లెనిన్ చిత్రాన్ని వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఇక జూన్ 26న లెనిన్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని తెలిపారు.
"మా లెనిన్ చిత్రాన్ని ముందుగా మే 1న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నాం. కారణం మన ప్రియమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం ఏప్రిల్ 30న విడుదల కాబోతుంది. మేము కూడా ఆ చిత్రాన్ని మీ అందరి లాగానే పాజిటివ్ వాతావరణం లో సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇక రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎంతో గొప్ప ఫ్రెండ్ షిప్ ఉందో మన అందరికీ తెలుసిందే. వాళ్ల మధ్య ఉన్న బంధానికి విలువ ఇచ్చే మేము ఈ సినిమాని వాయిదా వేయాలని అనుకుంటున్నాం" అని లెనిన్ చిత్ర యూనిట్ పేర్కొంది.

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయమైనప్పటికీ దాన్ని లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. శ్రీరామనవమి సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ లుక్ అదిరి పోయింది.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ












Click it and Unblock the Notifications