టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గ‌డువు స‌మీపిస్తోన్న కొద్దీ అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పంప‌కాల్లో ఆయా పార్టీల అగ్ర‌నేత‌లు తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను రూపొందించుకుంటోన్నాయి.

ఈ ప‌రిణామాల మ‌ధ్య తమిళన వెట్రి కజగం అధినేత విజయ్.. పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆయన స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. అదే సమయంలో మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. తిరుచ్చి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చొన్నారు.

Trisha Reportedly shared Photos Sparks debates on Social Media ahead of the Tamil Nadu Polls

ఈ జాబితాలో పలువురు పార్టీ ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. టీ నగర్ నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, మైలాపూర్ నుండి కోశాధికారి వెంకట్ రమణన్, విల్లివాక్కం నుండి ఆదవ్ అర్జున్ పోటీ చేయనున్నారు. జాబితా విడుదల సందర్భంగా విజయ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ప్రజల నిజమైన సంరక్షకులను పరిచయం చేస్తోన్నానంటూ అభ్యర్థుల గురించి వివరించారు.

ఈ పరిస్థితుల్లో నటి త్రిష తెరమీదికి వచ్చారు. ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ చర్చకు దారి తీసింది. హాట్‌ టాపిక్‌గా మారింది. అభ్యర్థులను ప్రకటిస్తోన్న తరుణంలో వెలువడిన త్రిష పోస్ట్ ఊహించని మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో పసుపు, ఎరుపు రంగు దుస్తులలో అందంగా పోజులిచ్చిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. విజయ్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తోండటం, త్రిష పసుపు రంగు దుస్తుల్లో కనిపించిన ఘటనలను యాదృచ్ఛికమని భావించట్లేదు అభిమానులు.

ఆమె ధరించిన దుస్తులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ జెండాలో కూడా పసుపు, ఎరుపు రంగులు ఉండటం ఆకర్షించింది. అదే టాపిక్ కు దారి తీసింది. ఆమె చేసిన ఈ పోస్ట్ పార్టీకి పరోక్ష మద్దతుగా మద్దతు తెలిపినట్లుగా భావిస్తున్నారు. ఇది ఓ సాధారణ ఫోటోషూట్ కాదని చెబుతున్నారు. ఇదివరకు విజయ్, త్రిష ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ సద్దుమణగక ముందే ఈ పోస్ట్ రావడంతో అభిమానులు మళ్ళీ వాటిని కలిపి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+