జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి. ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
========
మఖ నక్షత్రం (సింహ రాశి)
మఖ నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నెల ప్రారంభంలో కొంచెం ఒత్తిడిగా ఉన్నా, ద్వితీయార్థంలో అద్భుతంగా ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం. బాగా కలిసివస్తాయి. ధన ప్రవాహం బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు అందుకుంటారు. వీటిని విలాసాల కోసం ఖర్చుపెడతారు. నియంత్రణ లేకపోతే మొత్తం అయిపోతాయి. ఉత్సాహంగా ఉంటారు. కానీ, ఎముకలు లేదా పళ్లకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఆదివారం రోజున సూర్యాష్టకం పఠించడం లేదా గణపతిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.

పుబ్బ నక్షత్రం (సింహ రాశి)
పుబ్బ నక్షత్రం వారికి ఈ నెల సుఖ సంతోషాలతో కూడిన కాలం అని చెప్పవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నవారికి ఈ నెల గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు, పురస్కారాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, దాంతోపాటు వేతన పెరుగుదల ఉంది. జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త వస్త్రాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారం రోజున మహాలక్ష్మి అష్టకం పఠించడం లేదా పేద ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇవ్వడం వల్ల శుభం కలుగుతుంది.
=========
ఉత్తర నక్షత్రం (సింహ 1వ పాదం & కన్యా రాశి 2, 3, 4 పాదాలు)
ఉత్తర నక్షత్ర జాతకులకు ఈ నెల బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పట్టుదలతో పనిచేస్తేనే విజయం దక్కుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదురైనా, చివరకు సఫలమవుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసరపు అప్పులు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేయవద్దు. పొదుపుపై దృష్టి సారించాలి. తండ్రి లేదా పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం ఆందోళన ఉంటుంది. అయితే ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. వారితో వాదనలకు దిగకుండా ఉండటం శ్రేయస్కరం. కంటి సమస్యలు లేదా తలనొప్పి వేధించవచ్చు. కంటికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. విశ్రాంతి కోసం కంటికి సంబంధించిన యోగా చేయండి. నిత్యం 'ఆదిత్య హృదయం' పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు పనుల్లో విజయం సాధిస్తారు.
-
today rashiphalalu: మహాలక్ష్మీ యోగంతో ఆకస్మిక ధనలాభం -
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!











Click it and Unblock the Notifications