మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య: నంద్యాలలో అభిమాని చెంప చెళ్లు..(వీడియో)
దండ వేసి ఫోటో దిగాలని ఆయన వద్దకు ఉత్సాహంగా వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్నారు.
నంద్యాల: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతివాటానికి అభిమానులు బలైపోతూనే ఉన్నారు. ఇటీవల షూటింగ్ లొకేషన్‌లో అసిస్టెంట్‌పై ఆయన చేయి చేసుకున్న ఘటన మరవకముందే.. మరో అభిమాని చెంప చెళ్లమన్నది.
గతంలో ఇద్దరు, ముగ్గురు అభిమానుల పట్ల కూడా ఇదే రీతిలో వ్యవహరించిన బాలయ్య ఈ ఘటనతో మరోసారి విమర్శల్లో నిలిచారు.
బుధవారం నంద్యాల ఉపఎన్నిక ప్రచార పర్వాన్ని ముగించుకుని.. లాడ్జీ వద్దకు వచ్చిన సమయంలో ఓ అభిమానిపై బాలకృష్ణ చేయి చేసుకున్నారు. రాత్రి బస కోసం బాలకృష్ణ లాడ్జీ వద్దకు రాగా.. ఆయన్ను చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. ఆ సమయంలో అభిమాని ఒకరు దండవేసి బాలకృష్ణతో ఫోటో దిగాలని ఆశపడ్డాడు.
కానీ ఉత్సాహంగా వచ్చిన అభిమానిని బాలకృష్ణ నిరాశపరచడమే కాకుండా అతనిపై చేయి చేసుకుని తన దురుసుతనాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు. అక్కడే ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు బాలయ్య తీరు చూసి షాక్ తిన్నారు. టీడీపీ కార్యకర్తలు దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టడంతో.. ఎన్నికల వేళ ఇలాంటి విషయాలు పార్టీకి చేటు చేస్తాయని టీడీపీ ఆందోళన చెందుతోంది.
మరోవైపు అభిమానులు కూడా ఈ ఘటన పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫోటో దిగడానికి నిరాకరిస్తే నిరాకరించారు గానీ ఆమాత్రం దానికి చేయి చేసుకోవమెందుకు అని ప్రశ్నిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications