అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప.. పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత పార్ట్ 2.. విడుదలైన రోజు నుంచే పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద తన హవాని చూపించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.
ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. AA 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది.

కాగా ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప 3 కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నట్టు జోరుగా చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ సన్నద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఓ ప్రత్యేక ఆఫీస్ ను తీసుకొని ప్రాజెక్టు పైన వర్క్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ నటిస్తారని బీ టౌన్ గా టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అనుష్క తన భర్తతో కలిసి లండన్ లోనే ఉంటుండగా.. 8 సంవత్సరాల తర్వాత మళ్లీ స్క్రీన్ పైన కనిపించనుందని ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలోనే యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పుష్ప 3 కథపై స్టోరీలైన్ ఇదేనా..?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పుష్ప రాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఎలా మరింత బలంగా నిలబెట్టుకుంటాడు, శత్రువులు, ద్రోహులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నదే 'పుష్ప 3' ప్రధాన కథాంశంగా ఉండనుందని టాక్. ఈసారి పుష్ప రాజ్ మరింత రౌద్రంగా, రాజకీయాలు, అంతర్జాతీయ మాఫియాలతో ఢీకొనే స్థాయిలో కథ సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు రీసెంట్ గానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications