శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక
మెగా డాటర్ "నిహారిక కొణిదెల".. నాగబాబు కుమార్తెగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించింది. "ముద్దపప్పు అవకాయ" సహా పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సైతం యాంకర్ గా సత్తా చాటింది. ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి "ఒక మనసు" చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు పొందగలిగింది.
ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోవడంతో.. నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. "పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వెబ్ సిరీస్‌లు, చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. "డెడ్ లైన్", "కమిటీ కుర్రోళ్లు" వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించి, కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే నిర్మాతగా నిలిచింది.

ప్రస్తుతం "రాకాసా" సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా.. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ మూడో తేదీ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూవీ యూనిట్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మానస శర్మ, హీరోహీరోయిన్లు సంగీత్ శోభన్, నయాన్‌సారిక, కమెడియన్ గెటప్ శ్రీనుతో కలిసి నిహారిక సందడి చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిహారిక మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథాంశం, కామెడీ, హర్రర్ తో ఈ చిత్రం ఉంటుందన్నారు. టీజర్ ఇప్పటికే మంచి ఆదరణ పొంది, అంచనాలను పెంచిందన్నారు. అయితే ఈ సందర్భంగానే తన av గురించి సరదాగా కామెంట్స్ చేశారు. అరేయ్ నా AV ఎవడ్రా చేసింది..? ప్లీజ్ దయచేసి ఇలా చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. అలానే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని కోరారు. అనంతరం సినిమా యూనిట్‌ను కళాశాల యాజమాన్యం సన్మానించింది.
అరేయ్ నా AV ఎవడ్రా చేసింది..? ప్లీజ్ దయచేసి ఇలా చేయకండి..!!#NiharikaKonidela #Niharika #Raakaasaa #RaakaasaaTrailer #ReelTalk #OIReels #Oneindiatelugu pic.twitter.com/LjQKAzNXSp
— oneindiatelugu (@oneindiatelugu) March 26, 2026












Click it and Unblock the Notifications