Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెద్ద నోట్ల రద్దుపై తొలిసారి స్పందించిన జగన్: ఏమన్నారంటే..?

పెద్దనోట్ల రద్దు విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు.

రాజమహేంద్రవరం: పెద్దనోట్ల రద్దు విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి పెద్ద నోట్ల రద్దు విషయం ముందే తెలుసని.. అందుకే హెరిటేజ్‌ షేర్లు విక్రయించి జాగ్రత్త పడ్డారని ఆరోపించారు.

దివిస్ ఫార్మా ప్రభావిత ప్రజలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పెద్దనోట్ల రద్దుపై ఆయన తొలిసారి స్పందించారు. నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దనోట్ల రద్దు చేయడం మంచి నిర్ణయే అయినప్పటికీ.. దానికి సక్రమంగా అమలు చేయడం లేదని జగన్‌ విమర్శించారు.

చెలామణిలో ఉన్న నోట్లను ఒక్కసారిగా రద్దు చేయడంతో డబ్బుల్లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు సాధ్యమా? కాదా? అన్నది కేంద్రం ఆలోచించుకోవాలన్నారు. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిల్చుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారని.. వారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

ys jagan big notes ban

'మోడీ గారు ఆరోజు ప్రకటన చేసేటప్పుడు కూడా అవినీతిలో నుంచి వస్తున్న బ్లాక్ మనీని, బ్లాక్ మార్కెటింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనీని, డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనీని, మనీ లాండరింగ్ వల్ల వస్తున్న బ్లాక్ మనీని, ట్రాఫికింగ్ అండ్ కౌంటఫిట్ నోట్ల వల్ల వస్తున్న బ్లాక్ మనీని పూర్తిగా అరికట్టే కార్యక్రమం చేస్తామని ప్రకటన చేశారు. వ్యవస్థ నుంచి బ్లాక్ మనీ పోతుందని అందరూ కూడా మంచి నిర్ణయమే అనుకున్నాం' అని అన్నారు.

అంతేగాక, 'మనమైతే అందరూ సామాన్యులమే. వాళ్లు నిర్ణయం తీసుకుని మనకు చెబుతారు. మనమంతా ఇటువైపు రిసీవింగ్ ఎండ్‌లో ఉన్నాం. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతును వినిపిస్తుంది. అధికార పార్టీ నిర్ణయాలతో ప్రతిపక్షానికి సంబంధం ఉండదు. కామన్ మ్యాన్‌గా మనమంతా ఈ పక్క చూస్తుంటాం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రతిపక్షం తెలియజేస్తుంది. ఇవాళ మాత్రం పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. కేంద్రం నిర్ణయం వల్ల సంతోషంగా ఉన్నామని ప్రజలెవరూ చెప్పే పరిస్థితిలో లేరు' అని జగన్ అన్నారు.

అంతేగాక, 'స్పందించడం అన్నది ఏదైతే ఉందో... సోకాల్డ్ చంద్రబాబునాయుడు గారు తన మంత్రుల చేత చెప్పించడమో కాదు. నెగటివ్ మీడియాలో ఉన్న వాళ్లు రాస్తున్న దాని గురించి నేను ఒకటి చెప్పాలి. స్పందించడం అన్నది... ప్రతిపక్షంలో ఉన్నాం మేము. వాళ్లు ఏం నిర్ణయం తీసుకుంటున్నారన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. మీ మాదిరిగానే నేను కూడా. ఎవరైనా కూడా బ్లాక్ మనీ దీనివల్ల పోతుంది అంటే, ఎవడైనా హర్షిస్తామని చెబుతాడు. కానీ, నిజంగా ప్రతిపక్షం అంటే ఏంటి? వాయిస్ ఆఫ్ ది పీపుల్. ప్రజలందరూ బాగుంది అని అంటే, ప్రజలకు తోడుగా బాగుందని అంటాం. ప్రజలందరూ ఇది బాగోలేదు, వ్యతిరేకించండి అని వాయిస్ ఇస్తే, ప్రజల తరఫున వ్యతిరేకిస్తాం. దటీజ్ ప్రతిపక్షం' అని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+