జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..!

ఏపీలో పీసీసీ ఛీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిల (ys sharmila) చిన్న అవకాశం దొరికినా అన్న వైఎస్ జగన్ (ys jagan) ను టార్గెట్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఇవాళ మరోసారి తండ్రి వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేసిన షర్మిల.. ఇందులో అన్న వైఎస్ జగన్ ను మరోసారి టార్గెట్ చేశారు. పేదల గుండెల్లో మహనీయుడిగా నిలిచిన వైఎస్సార్ తనయుడై ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారని జగన్ ను షర్మిల ప్రశ్నించారు.

ఇవాళ ఏప్రిల్ 9! సరిగ్గా 23 సంవత్సరాల క్రితం మన తండ్రి, మహానేత డా వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర అనే మహాయజ్ఞము మొదలుపెట్టారని, పేదలబాగుకోసం, బడుగుల మంచికోసం, సకల జనుల సంక్షేమ మహాయాగానికి నాడు ఆయన ఆజ్యం పోశారని షర్మిల గుర్తుచేశారు. అయన ఈ పాదయాత్ర ఒక కాంగ్రెస్ సైనికునిగా, నాయకునిగా, పీసీసీ అధ్యక్షునిగా ప్రారంభించారని, ఆ తర్వాత అయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. మరి అటువంటి తండ్రికి కుమారునిగా, పార్టీ పేరులో అయన పేరును పొందుపర్చి మీరు నేడు చేస్తున్నది ఏమిటి? అని జగన్ ను ప్రశ్నించారు.

YS Sharmila Slams Brother Jagan s Politics on Father s Padayatra Anniversary

ఆజన్మాంతం పేదలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, రైతులు, ఎస్టీలు, వీరి కోసం తపించి, తన పాలనలో వీరికోసం ఎన్నో పధకాలను రచించిన అయన ఎక్కడ, నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళ క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం అయిన మీరెక్కడ? అంటూ జగన్ ను నిలదీశారు. లౌకికవాదాన్ని తన ఊపిరిలో నింపుకుని, అన్ని వర్గాలవారిని సమానంగా ఆదరించి, ప్రజల ఐక్యత కోసం పాటుపడింది వైఎస్సార్, మరి అయన తనయునిగా మీరు నేడు చేస్తున్నది ఏమిటి? మతోన్మాద బీజేపీ దగ్గర కేసులకు, రాజకీయ భవిత కోసం భయపడి మోకరిల్లడం అంటూ చురకలు అంటించారు.

YS Sharmila Slams Brother Jagan s Politics on Father s Padayatra Anniversary

ఇది ఎంత వరకు ధర్మం? బీజేపీ ప్రతి చర్యలో దళిత, మైనారిటీ వ్యతిరేక పోకడలు ఉన్నాయ్. వక్ఫ్ చట్టం అయితేనేమి, దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు ఐతేనేమి, ఎఫ్సీఆర్ఏ చట్టం అయితేనేమి, బుల్ డోజర్ రాజకేయాలితేనేమి, వీటన్నిటికి గల్లీలో మౌనం వహించి, ఢిల్లీలో బేషరతు మద్దత్తు ప్రకటించిన మీరా అయనకు నివాళి అర్పించేది ఇవాళ? అయనబతికుంటే ఇవి హర్షించేవారా? ఇది అయన ఆదర్శాలకు, అభిమతాలు పూర్తి వ్యతిరేకం కదా? అంటూ జగన్ పై రెచ్చిపోయారు. ఇక మీ అయిదేళ్ల పాలనలో సభ్యసమాజం సిగ్గుపడేలా దళితుల మీద, మహిళల మీద జరిగిన దాడులు, చివరికి మైనార్టీల మీద కూడా జరిగిన అక్రమాలు, ఇవన్నీ రాజశేఖర రెడ్డిగారి ఆత్మ క్షోభించే పనులు కాదంటారా? అని నిలదీశారు. అణువణువునా రాజశేఖర రెడ్డిగారి పాలనకు, ఆలోచనలకూ భిన్న ధృవంగా ఉంటూ మీరు ఇవాళ అయన పాదయాత్రను తల్చుకుని నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొన్న ప్రకటించినట్టు మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శన యాత్ర అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+